Ontimitta: రామనవమి ఉత్సవాలకు సిద్ధమైన ఒంటిమిట్ట.. ఆ రోజున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

కడప జిల్లా ఒంటిమిట్ట(Ottimitta) కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం సీతారాముల కల్యాణం నిర్వహించడానికి...

Ontimitta: రామనవమి ఉత్సవాలకు సిద్ధమైన ఒంటిమిట్ట.. ఆ రోజున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
Ottimitta
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 01, 2022 | 8:09 PM

కడప జిల్లా ఒంటిమిట్ట(Ontimitta) కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అదే రోజున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. ఒంటిమిట్టలో టీటీడీ నిర్మించిన ఆలయ కార్యాలయాల సముదాయం, అతిథి గృహం, యాత్రికుల వసతి సముదాయాలను ఆయన ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని, సీఎం ఆదేశాల మేరకు ఈ సారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైన మేర నిధులు వెచ్చించి ఆలయాన్ని మరింత సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాళ్లపాక అన్నమయ్య తిరుగాడిన ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ‌ని వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతిరోజు ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలు వినిపించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, దీనికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడతామని వివరించారు. అంతేకాకుండా నంద‌లూరు సౌమ్యనాథ‌స్వామి ఆలయాన్ని ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత టీటీడీలో విలీనం చేసేందుకు అన్ని చ‌ర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అన్నమ‌య్య మార్గాన్ని సంప్రదాయబద్దంగా న‌డ‌క‌, వాహ‌నాలల్లో వెళ్లేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.

Also Read

Shocking: బాత్రూం సోప్​ బాక్స్​లో కెమెరా.. డైలీ పాఠాలు చెప్పే టీచర్ ప్రైవేట్ వీడియోలు రికార్డ్.. చివరకు..

Vijayawada Temple: రేపటి నుంచి వసంత నవరాత్రులు.. ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి

Weight Loss Tips: వేసవిలో బరువు తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు..!