Weight Loss Tips: వేసవిలో బరువు తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు..!

Weight Loss Tips: చలికాలంలో చాలామంది వ్యాయామం చేయడానికి బద్దకిస్తారు. దీంతో బరువు పెరుగుతారు. అలాగే ఎండాకాలంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు.

Weight Loss Tips: వేసవిలో బరువు తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు..!
Follow us

|

Updated on: Apr 01, 2022 | 4:31 PM

Weight Loss Tips: చలికాలంలో చాలామంది వ్యాయామం చేయడానికి బద్దకిస్తారు. దీంతో బరువు పెరుగుతారు. అలాగే ఎండాకాలంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితిలో మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేసవిలో బరువు తగ్గడానికి ఏ పద్ధతులను అనుసరించాలో తెలుసుకుందాం. ముందుగా ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. పెరిగిన బరువును తగ్గించుకోవాలనుకుంటే ఫైబర్‌ అధికంగా ఉన్న పండ్లను తినాలి. ఇది కాకుండా ప్లేట్‌లో 60 శాతం తాజా కూరగాయలు ఉండాలి. అలాగే ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య తప్పనిసరిగా ఒక పండు తీసుకోవాలి. ఇది కాకుండా సోడియం మొత్తాన్ని తగ్గించండి. నూనె మొత్తాన్ని కూడా తగ్గించండి. ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ తినాలనుకునేవారు వారానికి ఒకసారి తినవచ్చు.

ఎక్కువ నీరు తాగండి: ఎండాకాలంలో బరువు తగ్గడానికి ఎక్కువ నీరు తాగాలి. మీరు ఎంత ఎక్కువ నీళ్లను తీసుకుంటే అంత తొందరగా బరువు తగ్గగలుగుతారు. నీటిని తీసుకోకపోవడం వల్ల కొవ్వు మీ శరీరం నుంచి బయటకు వెళ్లదు. మీరు ప్రతిరోజూ 5 నుంచి 6 లీటర్ల నీటిని తీసుకోవాలి. అంతేకాకుండా కొబ్బరి నీరు, నిమ్మరసం, కూరగాయల రసం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

తక్కువ తీపి తినండి: మీరు బరువు తగ్గాలనుకుంటే కొంతకాలం తీపి పదార్థాలను పూర్తిగా మానేయాలి. లేదంటే బెల్లంతో తయారుచేసిన స్వీట్లు తినవచ్చు. కానీ ప్రతిరోజూ తినడం మంచిది కాదు.

సమయానికి ఆహారం తినాలి: అన్నింటిలో మొదటిది సరైన సమయంలో ఆహారం తినడం. ప్రతిరోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకుంటే మీ జీవక్రియ బలంగా ఉంటుంది. కొవ్వును సులభంగా తగ్గించగలరు.

దినచర్యను ఈ విధంగా సెట్ చేయండి..

1. సమయానికి నిద్రపోండి. 8 నుంచి 9 గంటల నిద్ర పూర్తయిన తర్వాత మేల్కొనండి.

2. రాత్రి 8 గంటల తర్వాత తినడం పూర్తిగా మానుకోండి.

3. ఉదయం పూట అల్పాహారం తప్పనిసరి తీసుకోవాలి.

4. మీ ఆహారంలో స్నాక్స్‌గా అవిసె గింజలు, మఖానా గింజలను తీసుకోండి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Relationship: భార్యాభర్తలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే విడాకులే..!

Cricket Photos: ఇమ్రాన్‌ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం..

Latest Articles