uppula Raju |
Updated on: Apr 01, 2022 | 4:07 PM
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రికార్డుని ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజం బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డు ఏంటనేది ప్రశ్న..? అయితే బాబర్ ఆజం బద్దలు కొట్టిన ఇమ్రాన్ ఖాన్ రికార్డు 32 ఏళ్ల క్రితం నాటిది.
వాస్తవానికి ఈ రికార్డు ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరుకు సంబంధించినది. ఇంతకుముందు ఈ రికార్డు ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉండేది. దానిని ఇప్పుడు బాబర్ ఆజం బద్దలు కొట్టాడు.
ఇమ్రాన్ ఖాన్ 32 ఏళ్ల క్రితం అంటే 1990లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 82 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ 2022లో లాహోర్‌లో ఆడిన 114 పరుగుల ఇన్నింగ్స్‌తో బాబర్ ఆజం దానిని బ్రేక్ చేశాడు.
1990లో జావేద్ మియాందాద్ 74 పరుగులతో నాటౌట్‌గా ఉన్న రికార్డును ఇమ్రాన్ ఖాన్ బద్దలు కొట్టాడు. 1987లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మియాందాద్ ఆ స్కోరు సాధించాడు.