Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..

Liver Health: కాలేయ వ్యాధి ప్రారంభమైనప్పుడు చర్మంపై కొన్ని సంకేతాలను కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే మీ  కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..
liver
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2022 | 3:57 PM

మానవ శరీరంలో ఏదైనా వ్యాధి అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు, దాని ప్రభావం మొదట మన చర్మం(Skin)పై కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్ని వ్యాధులు చర్మం ద్వారా ప్రత్యేక సంకేతాలు చూపిస్తాయి. ఎవరికైనా కామెర్లు వచ్చినప్పుడు, వారి చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కాలేయం(liver)లో పిత్తం ఎక్కువగా మారిందని, దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనేందుకు ఇది ఒక సాధారణ సంకేతం. కామెర్లు వచ్చిన వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స ప్రారంభిస్తాం. కానీ, కాలేయ వ్యాధి ప్రారంభమైనప్పుడు ఎలాంటి సంకేతాలను వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ కాలేయ వ్యాధులు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో కాలేయ సంబంధిత వ్యాధి వచ్చిందని ఎలా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం..

చర్మం దురద – మీ కాలేయం అధ్వాన్నంగా ఉంటే దాని మొదటి లక్షణం రక్తంలో పిత్తం ఏర్పడటం. దీంతో చర్మం దురద పెట్టినట్లు అనిపిస్తుంది. అలాగే మీకు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

స్పైడర్ ఆంజియోమాస్ ఏర్పడటం – స్పైడర్ ఆంజియోమాస్(చర్మంపై రక్తనాళాలు విచ్ఛిన్నమైనట్లు కనిపించడం) మీ చర్మంపై పెరగడం ప్రారంభిస్తాయి. స్పైడర్ వెబ్ లాగా ఉంది. ఇది చర్మం దిగువ భాగంలో కూడా సంభవిస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు, అది సులభంగా కనిపిస్తుంది. అలా కనిపిస్తే కాలేయం సరిగా పనిచేయడం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది.

చర్మంపై నీలం రంగు దద్దుర్లు – మీ శరీరం కొన్ని ప్రదేశాలలో నీలం రంగులోకి మారినట్లయితే.. అప్పుడు ఇది కాలేయం దెబ్బతినే లక్షణంగా పరిగణించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టడానికి మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కాలేయంలో సరైన మొత్తంలో తయారు చేయబడవు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచింది.

Also Read: Health Tips: ఆహారంలో 3 రకాల కొవ్వులు ఉంటాయి.. అందులో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసా..!

Peanuts Benfits: ఎండాకాలం వేరుశెనగ గింజలు నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!