- Telugu News Photo Gallery Health Benefits of Eating cashews every morning on an empty stomach in Telugu
Cashew Health benefits: ప్రతిరోజూ 2 జీడిపప్పులు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Cashew Nuts And Health: జీడిపప్పులో శరీరానికి అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి. అయితే రుచిగా ఉంటాయిని వీటిని అతిగా తీసుకోకూడదు. అధిక బరువుతో పాటు పలు సమస్యలు తలెత్తుతాయి.
Updated on: Apr 01, 2022 | 4:03 PM

జీడిపప్పులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి మీరు రోజుకు 2 జీడిపప్పులను తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలను పొంతుతారు.

అయితే జీడిపప్పులను మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

జీడిపప్పులో పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, సెలీనియం తదితర పోషకాలు విరివిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె సమస్యలను కూడా తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

జీవక్రియ రేటును మెరుగుపరచడంలో బాదం బాగా సహాయ పడుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. అజీర్తి, ఎసిడిటీ లాంటి సమస్యలు తగ్గిపోతాయి.

మార్కెట్లో బాదం, జీడిపప్పు ధరలు ఎక్కువగా ఉన్నా వీటిని విస్మరించకూడదు. అలాగనీ రుచిగా ఉన్నాయని ఎక్కువగా తినకూడదు. బాదం పప్పుల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఇక అలర్జీలు ఉన్నవారు కూడా వీటిని మితంగా తీసుకోవాలి.

జీడిపప్పులో సోడియం, పొటాషియం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆడపిల్లలు రోజుకు రెండుసార్లు బాదంపప్పు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ముందురోజు రాత్రి నీటిలో నానబెట్టిన రెండు బాదం పప్పులను ఉదయాన్నే తీసుకుంటే పలు వ్యాధులు దూరమవుతాయి.




