Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi-Tirumala: ఉగాదికి ముస్తాబైన తిరుమల.. నేడు శ్రీవారి ఆలయంలో ఆస్థానం.. పంచాంగ శ్రవణం.. ఆ సేవలు రద్దు

Ugadi Tirumala: తెలుగు నూతన సంవత్సర(Telugu New Year) ఉగాదిని పురష్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శుభకృత్‌ నామ(ShubhaKruth Nama) సంవత్సర ఉగాది ఆస్థానం జరగనుంది..

Ugadi-Tirumala: ఉగాదికి ముస్తాబైన తిరుమల.. నేడు శ్రీవారి ఆలయంలో ఆస్థానం.. పంచాంగ శ్రవణం.. ఆ సేవలు రద్దు
Tirumala Ugadi 2
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2022 | 6:32 AM

Ugadi Tirumala: తెలుగు నూతన సంవత్సర(Telugu New Year) ఉగాదిని పురష్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శుభకృత్‌ నామ(ShubhaKruth Nama) సంవత్సర ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం సేవను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు.

Tirumala Ugadi 1

Tirumala Ugadi 1

ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విశ్వక్‌సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు.7గంటల నుండి 9గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు,ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. తర్వాత ఆలయంలో పంచాగ శ్రవణం నిర్వహిస్తారు.

Tirumala Ugadi

Tirumala Ugadi

ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పండువని పురష్కరించుకుని శీవారి ఆలయంలో నిర్వహించే అర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

Read Also:

రామనవమి ఉత్సవాలకు సిద్ధమైన ఒంటిమిట్ట.. ఆ రోజున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు రెడీ.. రాములోరి కి రామచిలక సందేశం..