Srirama Navami: కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు రెడీ.. రాములోరి కి రామచిలక సందేశం..
Srirama Navami: భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రత్యేకంగా కోటి తలంబ్రాలను గోటితో వలిసి సిద్ధం చేసారు... భక్తి శ్రద్ధలతో మూడు నెలలుగా ప్రత్యేకంగా ఈ ధాన్యాన్ని గోళ్ళతో వాలిచి..గత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని..

Srirama Navami: భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రత్యేకంగా కోటి తలంబ్రాలను గోటితో వలిసి సిద్ధం చేసారు… భక్తి శ్రద్ధలతో మూడు నెలలుగా ప్రత్యేకంగా ఈ ధాన్యాన్ని గోళ్ళతో వాలిచి..గత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లోని కోరుకొండ(Korukonda)కు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ గోటి తలంబ్రాలను తయారు చేస్తారు… నాడు సీతారాముల కళ్యాణానికి శచీదేవి, అహల్యలతో పాటు, శబరి తమ గోటితో వలచిన తలంబ్రాలనే ఉపయోగించారన్న పురాణ కథనంతో ప్రేరణ పొందిన ఈ శ్రీకృష్ణచైతన్య సంఘం స్థాపకుడు కళ్యాణం అప్పారావు తానే ఈ బృహుత్కార్యానికి పూనుకున్నారు. 2012లో రామభక్తులను ఏకం చేసి.. తాను తన సొంత పొలంలో పండించిన వడ్లను వారికి ముందుగానే అందించి.. ఓ శుభ ముహూర్తాన తలంబ్రాలు వలవడం మొదలుపట్టారు.
శ్రీరామక్షేత్రంలోనే గోటితలంబ్రాల పంట.పండించి ఈ గోటి తలంబ్రాల విషయంలో అడుగడుగునా ప్రతి విషయంలోనూ ప్రత్యేక భక్తిశ్రద్ధలను తీసుకుంటారు. తలంబ్రాలకు ఉపయోగించే వరి నారు పోసే దగ్గరి నుంచి.. పంట కోత కోసేదాకా ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగానే భావించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహిస్తుంటారు. నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం సీతారాముల మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో ఆంజనేయుడు, ఇతర వానరుల వేషధారణలోనే పొలం దున్ని, నారు పోసి.. మడి చేసి నాట్లు వేస్తారు. పొట్ట దశకు వచ్చాక శ్రీమంతం కూడా చేస్తారు. వరికోత సమంయలోనూ రాముడి వేషధారణలో ఉన్న భక్తునికి మొదట అందజేస్తారు.
ఇలా మూడు నెలల పాటు భక్తి శ్రద్ధలతో పండించిన పంటను.. శ్రీరామనవమి రెండు నెలల ముందు నుంచే భక్తజనానికి పంపిణీ చేసి వారిచేత వలిపిస్తారు. ఇలా పరిసర గ్రామాల ప్రజలు ఈ కోటి గోటి తలంబ్రాల మహా యజ్ణంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమానికి వడ్లు వలుపు.. శ్రీరాముని పిలుపు’ పేరిట నామకరణం చేస్తారు… అనంతరం ఇలా వలిచిన బియ్యాన్ని ప్రత్యేక కుండలో నింపి రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు కార్యక్రమం నిర్వహించి.. భద్రాచలం తీసుకొస్తారు. ఇలా తెచ్చిన తలంబ్రాలతో భద్రాద్రి ప్రదక్షిణ చేస్తారు… తలంబ్రాలు తీసుకొస్తున్న రామయ్య అంటూ రామచిలుకతో సందేహం గోదావరి చెంతన జరగడం అదృష్టం గా భావిస్తున్నాను అంటున్నారు నిర్వాహకులు
ఎన్నో ఏళ్లుగా భద్రాద్రి రామయ్యకు ఈ గోటి తలంబ్రాలను ఆలయంలో అప్పగిస్తున్నారు.. వీటినే శ్రీసీతారాముల కళ్యాణంలో వినియోగిస్తారు. ఇలా ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో ఏటా భక్తులు విరివిగా ముందుకొస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో జరిపే సీతారాముల కళ్యాణానికి సైతం ఈ గోటి తలంబ్రాలను పంపుతున్నామంతున్నారు కల్యాణం అప్పారావు..
కల్యాణోత్సవం అంటే గుర్తొచ్చేది.. భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణమే. దీనికోసం భక్తలు ఎదురు చూస్తుంటారు. సీతారామకల్యాణాన్ని చూస్తూనే వారు తరించిపోతారు. ఈయేడాది ఏప్రిల్ 10 న జరగనున్న శ్రీరామనవమికి పంపే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంటుంది..భద్రాద్రి రామయ్య కల్యాణానికి తలంబ్రాలు స్వయంగా..రామ నామం తో వలుస్తున్న మహిళలు కల్యాణానికి కోటి తలంబ్రాలు పంపుతారు.. కల్యాణం అనంతరం తిరిగి ఎవరైతే ఈ కోట తలంబ్రాలు వాలిచారో వారికి …కల్యాణం అనంతరం రాములోరి తలంబ్రాలు తిరిగి వీరికి పంపించడం ఆనవాయితీ.. చివరి ఘట్టం రాజమండ్రి పుష్కర ఘాట్ గోదావరి ఘటన జరగడం గోదావరి సినిమాను తలపిస్తుంది.
Reporter : Satya Tv9 Telugu
Read Also : శతాధిక వృద్ధుడు స్వామి శివానంద ఫిట్‌నెస్ రహస్యం ఏమిటంటే
