AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basil water: తులసి నీరు అత్యంత పవిత్రం.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Basil water: హిందూమతం ప్రకారం తులసి మొక్కని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఈ

Basil water: తులసి నీరు అత్యంత పవిత్రం.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Basil Water
uppula Raju
|

Updated on: Apr 01, 2022 | 1:06 PM

Share

Basil water: హిందూమతం ప్రకారం తులసి మొక్కని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఈ మొక్క ఇంటి వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి అనేక రకాల సమస్యలని పరిష్కరిస్తాయి. ఈ కారణంగానే తులసి మొక్కని ప్రతి ఇంట్లో పూజిస్తారు. తులసి ఆకులతో తయారు చేసిన నీరు చాలా శక్తివంతమైనది ఇంకా పవిత్రమైనది. ఇది ఇంటి నుంచి అన్ని దోషాలని తొలగిస్తుంది. తులసి నీరు అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తులసి చెట్టుకి రోజూ పూజ చేసిన తర్వాత తులసి నీళ్లను ఇంట్లో చల్లాలి. ఇది మీ ఇంటి వాస్తు దోషాలని తొలగిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మీ ఇంట్లో శ్రీ కృష్ణుడి విగ్రహం ఉంటే పూజ సమయంలో తులసి నీటితో స్నానం చేయించండి. ఎందుకంటే తులసి శ్రీ కృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రాధా, కృష్ణుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

మీరు కార్యాలయంలో, ఫ్యాక్టరీలో, దుకాణంలో మీ డెస్క్ చుట్టూ తులసి నీటిని చల్లితే అది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. మీ పనిలో అడ్డంకులు తొలగిపోయి అభివృద్ధి దిశగా పయనిస్తారు. మీ కుటుంబ సభ్యుడు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటే పూజ చేసిన తర్వాత తులసి ఆకుల నీటిని అతనిపై చల్లి క్రమం తప్పకుండా తాగేలా చూడండి. అతనిలోని నెగిటివిటీ తొలగిపోయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తొందరలోనే అతడు కోలుకునే విధంగా చేస్తుంది. తులసి నీటిని తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం సూర్యాస్తమయానికి ముందు కొన్ని ఆకులను తీసుకోవాలి. ఈ ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తులసి లక్షణాలు, శక్తి రాత్రిపూట ఈ నీటిలోకి వస్తాయి. ఉదయం ఈ నీటిని వినియోగించాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందించడం జరిగింది.

ఏప్రిల్‌ 1 నుంచి ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టండి.. మంచి రాబడిని పొందండి..!

New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్‌ ఇవే..!

Travelling Plan: సాహసయాత్ర చేయాలనుకుంటే ఢిల్లీ నుంచి లేహ్ గొప్ప ఎంపిక.. ఎందుకంటే..?