Vizag Manyam: మన్యం గిరుల్లో కాఫీ పూల ఘుమఘుమలు..!.. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న విరులు
విశాఖ ఏజెన్సీ(Vizag Agency) అనగానే ఎత్తైన కొండలు.. పచ్చటి చెట్లు.. తోటలు.. ప్రకృతి అందాలు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ మన్యం(Manyam) అందాలు వర్ణించలేనివి. ఒక్కో సీజన్లో విశాఖ మన్యం ఒక్కో ప్రకృతి అందాన్ని సంతరించుకుంటుంది....
విశాఖ ఏజెన్సీ(Vizag Agency) అనగానే ఎత్తైన కొండలు.. పచ్చటి చెట్లు.. తోటలు.. ప్రకృతి అందాలు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ మన్యం(Manyam) అందాలు వర్ణించలేనివి. ఒక్కో సీజన్లో విశాఖ మన్యం ఒక్కో ప్రకృతి అందాన్ని సంతరించుకుంటుంది. వర్షాకాలంలో(Rainy Season) పచ్చని చెట్లన్నీ పులకిస్తే శీతాకాలంలో గిరులను మంచుదుప్పటి కమ్మేస్తాయి. వలిసె పూల అందాలు పచ్చటి తివాచీ పరచినట్లుగా కనువిందు చేస్తాయి. ఇక వేసవి వచ్చిందంటే చాలు… గిరులన్నీ కాఫీ పూల ఘుమఘుమలతో సువాసన వెదజల్లుతుంటాయి. ప్రకృతి అందాలకు నిలయం విశాఖ మన్యం. ఏ సీజన్ లోనైనా ఏజెన్సీ ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. వర్షాకాలంలో ఒకలా.. శీతాకాలంలో మరోలా కనువిందుచేసే మన్యం వేసవి వచ్చిందంటే చాలు కాఫీ పూల అందాలతో పులకిస్తోంది. విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల్లో లక్షా యాభై రెండు వేల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. వేలాది మంది రైతులు ఈ కాఫీ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచి ఆదాయం వచ్చే పంట కావడంతో ఏజెన్సీలోని మెట్ట ప్రాంతాల్లో చాలా మంది గిరిజన రైతులు.. కాఫీ పంట పండిస్తూ ఉంటారు.
పాడేరు ఘాట్ రోడ్డు నుంచి మొదలై చిలకలగడ్డ, సీలేరు వరకు కాఫీ తోటలు విస్తరించి ఉన్నాయి. ఏజెన్సీలో పండే ఈ కాఫీ తోటలు వేసవి సీజన్ లో పూతకు వస్తాయి. తెల్లటి వర్ణంలో చెట్లన్నీ శ్వేత దుప్పటిని పరచుకున్నట్టు మెరిసిపోతుంటాయి. సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు కాఫీ తోటల అందాలను వీక్షిస్తూ ఉంటారు.
– ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం
Also Read
Relationship: భార్యాభర్తలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే విడాకులే..!
Goa Cabinet Ministers: గోవా కేబినెట్‌లో కోటీశ్వరులు మాత్రమే మంత్రులు కాగలరా?
Sreemukhi: ఉగాది స్పెషల్.. ట్రెడిషనల్ లుక్ లో అందాల యాంకరమ్మ.. శ్రీముఖి క్యూట్ ఫోటోస్