AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఈ నగరాల మధ్యే

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విజయవాడ(Vijayawada) మీదుగా 72 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు.. కాకినాడ టౌన్ - లింగంపల్లి,...

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఈ నగరాల మధ్యే
Special Trains
Ganesh Mudavath
|

Updated on: Apr 01, 2022 | 5:07 PM

Share

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విజయవాడ(Vijayawada) మీదుగా 72 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు.. కాకినాడ టౌన్ – లింగంపల్లి, నాందేడ్ – విశాఖపట్నం మధ్య సర్వీసులు అందిస్తాయని వెల్లడించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 07295-07296 నంబరు గల కాకినాడ టౌన్‌-లింగంపల్లి ప్రత్యేక రైలు.. ఏప్రిల్‌ 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29, మే 2, 4, 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30, జూన్‌ 1, 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్‌లో రాత్రి 8.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15కి లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఏప్రిల్‌ 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30, మే 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31, జూన్‌ 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో లింగంపల్లిలో సాయంత్రం 6.25కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10కి కాకినాడ టౌన్‌ చేరుతుంది. సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

నాందేడ్ – విశాఖపట్నం ప్రత్యేక రైలు..

07082-07083 నంబర్ గల నాందేడ్‌ – విశాఖపట్నం ప్రత్యేక రైలు.. ఏప్రిల్‌ 1వ తేదీన నాందేడ్‌లో సాయంత్రం 4.35కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.50కి విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఏప్రిల్‌ 3న విశాఖపట్నంలో సాయంత్రం 6.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10కి నాందేడ్‌ చేరుతుంది. బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, సికింద్రాబాద్‌, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. రైలు నెంబరు 22855 – 22856 సంత్రాగచి – తిరుపతి రైలుకు ఏప్రిల్ మూడో తేదీ నుంచి రెండు స్లీపర్‌ తరగతి బోగీలను అదనంగా వేయనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించాలని అధికారులు పేర్కొన్నారు.

Also Read

Telangana: వీడేం దొంగరా సామి.. చిల్లిగవ్వ దొరక్క చివరకు ఏమి ఎత్తుకెళ్లాడో తెలిస్తే నవ్వుకుంటారు

Ram Gopal Varma: ఊపిరి బిగబట్టి చూసేలా వెబ్ సిరీస్ తెరకెక్కించాం.. ‘దహనం’ ట్రైలర్ లాంచ్‌లో రామ్ గోపాల్ వర్మ..

Bhagwant Mann: పంజాబ్‌ తీర్మానంతో మళ్లీ మొదలైన వివాదం.. ఇప్పటికైనా ఆ సమస్య తీరుతుందా..