Ram Gopal Varma: ఊపిరి బిగబట్టి చూసేలా వెబ్ సిరీస్ తెరకెక్కించాం.. ‘దహనం’ ట్రైలర్ లాంచ్‌లో రామ్ గోపాల్ వర్మ..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. హిట్లు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు ఆర్జీవీ.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నుంచి సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. హిట్లు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు ఆర్జీవీ. ఆయన నిర్మాణ సంస్థ నుంచి మరో ఆసక్తికర వెబ్రా సిరీస్ రానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ ను దహనం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ డ్రామా, ఏడు ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. ఇషా కొప్పికర్, అభిషేక్ దుహన్, నైనా గంగూలీ, అశ్వత్‌కాంత్ శర్మ, అభిలాష్ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే మరియు ప్రదీప్ రావత్‌లు కీలకమైన పాత్రలలో నటించారు. ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంతో ఈ సిరీర్ రూపొందించారు. ఈ ఎపిసోడ్లనూ ఎంఎక్స్ ప్లేయర్‌పై 14 ఏప్రిల్ నుంచి ప్రసారం చేయనున్నారు. వణుకు పుట్టించేలా యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో సుప్రసిద్ధులైన రామ్‌గోపాల్ వర్మ మరోమారు పూర్తి యాక్షన్ కథాంశంతో రాబోతున్నారు.
తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది. ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంలో తీర్చిదిద్దబడిన కథాంశాన్ని ‘దహనం’ పేరిట ఏడు ఎపిసోడ్ల సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు ఎంఎక్స్ ప్లేయర్ తీసుకురానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్ చేయనున్నారు. ఈ ట్రైలర్‌లో ఓ కమ్యూనిస్ట్ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.అది గ్రామంలో ఏ విధంగా సంచలనంగా మారింది అనేది చూపించారు. శ్రీరాములు పెద్ద కొడుకు హరి, ఓ విప్లవకారుడు (నక్సలైట్). అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భుస్వాములతో చేస్తుంటాడు. అతను తన తండ్రి మరణ వార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గుండాలకు, అతనికి జరిగే పోరాటం ఆసక్తి రేకెత్తిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల ఆధిపత్యం గ్రామంలో పెరగడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలూ పెరుగుతాయి. తన తండ్రి మరణానికి కారకులైన వారిపై హరి పగతీర్చుకున్నాడా ?లేదా అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూపించన్నారు.
ఈ వెబ్ సిరీస్ గురించి రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘‘నా మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘దహనం’ను ఎంఎక్స్ ప్లేయర్ భాగస్వామ్యంతో రూపొందించడం పట్ల సంతోషంగా ఉన్నాను అన్నారు. ఈ కథనం రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు నడుమ దాగిన చీకటి కోణాన్ని స్పృశిస్తుంది . అవేమిటంటే, ‘కంటికి కన్ను అని అనుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని గుడ్డిగా మార్చడంలో మాత్రమే మనం విజయం సాధించగలమ’ని మహాత్మాగాంధీ చెబుతారు. కానీ మహాభారతంలో మాత్రం ‘ప్రతీకారం అనేది పూర్తిగా స్వచ్ఛమైన ఓ భావోద్వేగం’ అని చెబుతుంది. ‘దహనం’ వెబ్ సిరీస్‌లో కేవలం ప్రతీకారం గురించి మాత్రమే వెల్లడించడం కాదు, ఆ ప్రతీకార పర్యవసానాలు కూడా చర్చించాము. ఇది క్రైమ్ థ్రిల్లర్ కాదు, కానీ థ్రిల్లింగ్ క్రైమ్స్‌తో కూడినది. ఊపిరిబిగబట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దడం జరిగింది.ఈ షోతో మేము కేవలం ఓ అడుగు ముందుకేయడం కాదు, కథ డిమాండ్ చేసిన తీరుతో తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసిన నటీనటుల అద్భుత నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో మైళ్ల దూరం వెళ్లగలిగాం. ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మా మొత్తం బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని అన్నారు ఆర్జీవీ.
మరిన్ని ఇక్కడ చదవండి :