Telangana: వీడేం దొంగరా సామి.. చిల్లిగవ్వ దొరక్క చివరకు ఏమి ఎత్తుకెళ్లాడో తెలిస్తే నవ్వుకుంటారు

దొంగతనానికి వెళ్లిన దొంగకు చిల్లిగవ్వ దొరక్కపోయేసరికి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో ఊగిపోయాడు. సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశాడు. ఆపై....

Telangana: వీడేం దొంగరా సామి.. చిల్లిగవ్వ దొరక్క చివరకు ఏమి ఎత్తుకెళ్లాడో తెలిస్తే నవ్వుకుంటారు
Strange Thief
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 01, 2022 | 4:57 PM

Thief Viral Video: దొంగలు చాలా రకాలు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. డబ్బు, బంగారం దోచుకెళ్లేవారు కొందరైతే.. బైక్స్, వస్తువులు మాయం చేసేవాళ్లు ఇంకొందరు. అయితే ఎంతో కష్టపడి దొంగతనానికి పోతే.. అక్కడ ఏమి దొరక్కపోతే ఆ దొంగలకు తల కొట్టేసినట్టు ఉంటుంది. తాజాగా నిర్మల్ జిల్లా(Nirmal district)లో ఓ దొంగకు అలాంటి పరిస్థితే ఎదురయ్యింది.  భైంసాలోని ఆర్డీవో ఆఫీసులో దొంగతనం చేయడానికి వెళ్లాడు ఓ దొంగ. అక్కడ అతను వెతకని ప్లేస్ అంటూ లేదు. మెట్ల కింద సెర్చ్ చేశాడు. కిటీకీల నుంచి తొంగి చూశాడు. లోపల బీరువాలో కూడా చెక్ చేశాడు. కానీ అతడి బ్యాడ్ లక్.. ఏం దొరకలేదు. అమ్మమ్మ ఇంటికి దసరా పండక్కి పోయిన మనవడి లెక్క ఆఫీస్ అంతా కలియ తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది. ఫైల్స్ తప్ప ఒక్క పైసా కనిపించలేదు. దీంతో అతడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపటికి  కోపంతో సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశాడు. ఇక ఉత్త చేతుల్తో పోతే వృత్తికి కళంకం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ..  పక్కనే ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో ఫ్యాన్ ను ఎత్తుకెళ్లాడు. తెల్లారి ఆఫీసుకు వచ్చిన సిబ్బందికి.. అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చూస్తే ఈ దొంగగారి బాగోతం బయటపడింది.

Also Read: : పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో

చైన్ స్నాచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. అతడెవరో తెలిసి నిర్ఘాంతపోయిన పోలీసులు