Yadagirigutta: కుమార్తె తో కలిసి బిల్డింగ్ పై నుంచి దూకిన తండ్రి.. సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు
ప్రముఖ పుణ్యక్షేత్ర పట్టణం యాదగిరిగుట్టలో(Yadagirigutta) విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతే కుమార్తెను తల్లి సరిగా చూసుకోలేదనే కారణంతో ఆమెతో...
ప్రముఖ పుణ్యక్షేత్ర పట్టణం యాదగిరిగుట్టలో(Yadagirigutta) విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతే కుమార్తెను తల్లి సరిగా చూసుకోలేదనే కారణంతో ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్(Suicide note) లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సురేశ్ కు భార్య, ఆరేళ్ల కుమార్తె శ్రేష్ఠ ఉన్నారు. గురువారం ఉదయం సురేశ్ తన కూతురు శ్రేష్ఠను తీసుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఎవరూ లేని సమయంలో కుమార్తెతో సహా హోటల్ బిల్డింగ్ పై నుంచి దూకాడు. గమనించిన స్థానికులు, హోటల్ నిర్వాహకులు ఘటనాస్థలానికి చేరుకునే సరికే ఇద్దరూ మృతి చెందారు. విషయం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు.
సూసైడ్ నోట్ ఆధారంగా సురేశ్ లింగంపల్లి బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయంలో సబ్ డివిజినల్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కుటుంబ గొడవలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చనిపోతే తన కూతురిను భార్య సరిగా చూసుకోదనే కారణంతో కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్‌లో వివరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Also Read
Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..
West Godavari: బస్సు సీట్ల కింద లగేజీ క్యారియర్లు.. ఓపెన్ చేసి షాక్ తిన్న అధికారులు..