AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagwant Mann: పంజాబ్‌ తీర్మానంతో మళ్లీ మొదలైన వివాదం.. ఇప్పటికైనా ఆ సమస్య తీరుతుందా..

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann) చండీగఢ్‌(Chandigarh)ను తక్షణమే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పంజాబ్(Punjab), హర్యానా( Haryana) మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది...

Bhagwant Mann: పంజాబ్‌ తీర్మానంతో మళ్లీ మొదలైన వివాదం.. ఇప్పటికైనా ఆ సమస్య తీరుతుందా..
Chandigarh
Srinivas Chekkilla
|

Updated on: Apr 01, 2022 | 3:35 PM

Share

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann) చండీగఢ్‌(Chandigarh)ను తక్షణమే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పంజాబ్(Punjab), హర్యానా( Haryana) మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. కేంద్ర పాలిత ప్రాంతాన్ని పాలించడంలో “సమతుల్యతను దెబ్బతీసేందుకు” కేంద్రం ప్రయత్నిస్తోందని మాన్ ఆరోపించారు. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం పంజాబ్‌ నుంచి హర్యానా, హిమాచల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలను విభజన సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించారని అసెంబ్లీలో తీర్మానానికి సంబంధించిన నోటీసులో మన్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా నామినీలకు కొంత నిష్పత్తిలో మేనేజ్‌మెంట్ పదవులను ఇవ్వడం ద్వారా భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వంటి ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో బ్యాలెన్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు ఈ సమతుల్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నించేలా ఉందని’’ నోటీసులో పేర్కొన్నారు.

చండీగఢ్‌ను ఎందుకు యూటీగా మార్చారు..?

విభజన తర్వాత భారతదేశంలోకి వచ్చిన బ్రిటిష్ పంజాబ్ ప్రావిన్స్ తూర్పు భాగం, తూర్పు పంజాబ్ రాజధానిగా చండీగఢ్ ఉండవలసి ఉంది. బ్రిటిష్ ప్రావిన్స్‌లోని పశ్చిమ భాగం (పశ్చిమ పంజాబ్) లాహోర్‌ను రాజధానిగా చేసుకుని పాకిస్తాన్‌లో కలిసింది. లాహోర్ బ్రిటిష్ పంజాబ్ ప్రావిన్స్‌కు కూడా రాజధాని ఉంది. మార్చి 1948లో భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న తూర్పు పంజాబ్ ప్రావిన్స్, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, కొత్త రాజధాని కోసం శివాలికుల పాదాల ప్రాంతంలోని ప్రాంతాన్ని ఆమోదించింది. రాష్ట్రంగా అవతరించిన తర్వాత 1950లో ఈ ప్రావిన్స్‌కి పంజాబ్‌గా పేరు పెట్టారు. 1952 నుండి 1966 వరకు చండీగఢ్ పంజాబ్ రాజధానిగా ఉంది.

పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం

1966లో పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పంజాబ్ విభజన చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయడంతో సహా పలు అంతర్రాష్ట్ర సమస్యలకు దారితీసింది. ఆ సమయంలో చండీగఢ్ పంజాబ్‌తో పాటు హర్యానాలో కూడా భాగమని హర్యానా వాదించింది. దీంతో అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్రిక్తతలను తగ్గించడానికి కేంద్రం.. చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇది రెండు రాష్ట్రాల మధ్య బర్నింగ్ సమస్యగా మిగిలిపోయింది. చట్టం ప్రకారం చండీగఢ్ UT అయినప్పటికీ, పంజాబ్‌లో ప్రస్తుత చట్టాలు దీనికి వర్తిస్తాయి. ఆస్తుల పంపిణీ: పూర్వపు పంజాబ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో, పంజాబ్, హర్యానాల మధ్య అన్ని ఆస్తులను వరుసగా 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. చండీగఢ్ పంజాబ్ రాజధానిగా ఉండాలని పంజాబ్ పట్టుబట్టింది.

పంజాబ్ వాదన

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హర్యానాకు తగిన సమయంలో సొంత రాజధాని ఏర్పాటు చేస్తామని.. చండీగఢ్ పంజాబ్‌కు వెళ్తుందని చెప్పారు. లోక్‌సభలో సమర్పించిన పత్రాల ప్రకారం హర్యానా ఆవిర్భవించిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జనవరి 29, 1970న కేంద్రం అధికారిక ప్రకటనను కూడా జారీ చేసింది. “రెండు రాష్ట్రాల వాదనలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసిన తర్వాత, చండీగఢ్ రాజధాని ప్రాజెక్ట్ ప్రాంతం మొత్తం పంజాబ్‌కు వెళ్లాలి” అని నోట్ పేర్కొంది. మళ్లీ, 1985లో రాజీవ్-లాంగోవాల్ ఒప్పందం ప్రకారం, చండీగఢ్‌ను జనవరి 26, 1986న పంజాబ్‌కు అప్పగించాల్సి ఉంది. అయితే రాజీవ్ గాంధీ ప్రభుత్వం చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

హర్యానా వాదన

1970 విభజనతో సహా సమస్యను పరిష్కరించడానికి కేంద్రం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. చండీగఢ్ ఒక రాష్ట్రానికి రాజధానిగా పనిచేయడానికి ప్రణాళికాబద్ధమైన నగరంగా నిర్మించబడినందున ఇది ఆచరణాత్మకమైనది కాదు. హర్యానా తన సొంత రాజధానికి మారే వరకు చండీగఢ్‌లోని కార్యాలయం, నివాస వసతిని ఐదేళ్ల పాటు మాత్రమే ఉపయోగించుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. హర్యానాకు రూ.10 కోట్ల గ్రాంట్‌తో పాటు కొత్త రాజధాని ఏర్పాటుకు సమానమైన రుణాన్ని అందిస్తామని కేంద్రం ప్రకటించింది. 2018లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చండీగఢ్ అభివృద్ధి కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దానిని తిరస్కరించారు. చండీగఢ్ “నిస్సందేహంగా పంజాబ్‌కు చెందినది” అని అన్నారు. హర్యానా ప్రత్యేక హైకోర్టును డిమాండ్ చేస్తోంది. పంజాబ్ ఆధీనంలో ఉన్న విధానసభ కాంప్లెక్స్‌లో 20 గదులు కావాలని హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా పంజాబ్ వాదనలను వివాదాస్పదం చేసింది.

Read  Also.. Nitish Kumar: ఉప రాష్ట్రపతిగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్