AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rimi Sen: దారుణంగా మోసపోయిన మెగాస్టార్ హీరోయిన్.. ఏకంగా నాలుగు కోట్లు పోగొట్టుకుందట..

మెత్తని మాటలు చెప్పి సొత్తు కాజేసిన కేటుగాళ్లు గురించి నిత్యం వార్తల్లో చెప్తూనే ఉన్నారు. మోసగాళ్ల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ కొందరు గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

Rimi Sen: దారుణంగా మోసపోయిన మెగాస్టార్ హీరోయిన్.. ఏకంగా నాలుగు కోట్లు పోగొట్టుకుందట..
Rimi Sen
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2022 | 4:24 PM

Share

మెత్తని మాటలు చెప్పి సొత్తు కాజేసిన కేటుగాళ్లు గురించి నిత్యం వార్తల్లో చెప్తూనే ఉన్నారు. మోసగాళ్ల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ కొందరు గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చివరకు విషయం తెలుసుకొని బోరుమంటున్నారు. తాజాగా ఓ అందాల భామ కూడా ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది. ఏకంగా 4 కోట్ల వరకు పోగొట్టుకుంది ఈ అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరివాడు సినిమాలో నటించి అలరించింది రిమీ సేన్(Rimi Sen). ఈ అమ్మడు తెలుగులో ఈ ఒక్క సినిమానే చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా సినిమాల్లో రాణించలేదు ఈ సుందరి. సినిమాల్లో మెరవకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రిమీ సేన్. ఇక ఈ అమ్మడు ఇటీవల బిజినెస్ లో రాణించాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే ఓ వ్యక్తిని నమ్మి 4 కోట్లు పోగొట్టుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారంలో పెట్టుబడి పేరుతో  గోరేగావ్ కు చెందిన వ్యాపారవేత్త రిమీ సేన్ నుంచి ఏకంగా 4.1 కోట్ల రూపాయలను రాబట్టాడు. అతడి మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన రిమీ పోలీసులను ఆశ్రయించింది. మూడు సంవత్సరాల క్రితం రౌనక్ జతిన్ వ్యాస్ ను అంథేరిలోని ఒక జిమ్ సెంటర్ లో కలిసిందట రిమీ సేన్. అప్పుడు  తాను ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని.. తాను చాలా వ్యాపారాలను చేస్తుంటాన్ని అతడు చెప్పుకొచ్చాడట. అతడి మాటలు నమ్మి  కొద్దికొద్దిగా అమౌంట్ ఇస్తూ.. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను ఇచ్చిందట. కొత్త వ్యాపారం చేస్తున్నట్లుగా తనను నమ్మించి ఆ డబ్బును  వసూల్ చేశాడట. ఇప్పుడు ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరితే మొహం చాటేశాడట. దాంతో పోలీసులను ఆశ్రయించింది రిమీ. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు జతిన్ వ్యాస్ పై 420 , 409 కేసులను పెట్టారు పోలీసులు. అతడికి చెందిన కంపెనీల గురించి ఆరా తీయగా అన్నీ బోగస్ అని తేలిందట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina: బుట్టబొమ్మ అందాలతో అలరింప చేస్తున్న దీప్తి సునైనా లేటెస్ట్ ఫోటోస్

Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వరరావులో ఒక్కరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే..

Paruchuri: అన్నయ్య అలా మారడానికి అదే కారణం.. వైరల్‌ ఫోటోపై స్పందించిన పరుచూరి గోపాల కృష్ణా..

Follow Us
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ