AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rachakonda Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి ఉచిత కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Free Coaching For Police Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. పోలీస్ జాబ్స్ (Telangana Police Jobs) కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాచకొండ పోలీసులు (Rachakonda Police) శుభవార్త చెప్పారు. వీరికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Rachakonda Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి ఉచిత కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
Coaching For Police Jobs
Sanjay Kasula
|

Updated on: Apr 02, 2022 | 7:25 AM

Share

Telangana Police Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. పోలీస్ జాబ్స్ (Telangana Police Jobs) కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాచకొండ పోలీసులు (Rachakonda Police) శుభవార్త చెప్పారు. వీరికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈ 80,039 ఖాళీల్లో అత్యధికంగా పోలీస్ శాఖలో 18,334 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖాళీలకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతూ ఉంటారు. అయితే.. చాలా మంది పేద వర్గాలకు చెందిన అభ్యర్థులు కోచింగ్ తీసుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాంటి వారికి  రాచకొండ పోలీసులు గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాచకొండ జోన్‌కు పరిధిలో నివాసం ఉండే అర్హులైన నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుందని వెల్లడించారు. అనుభవం కలిగిన నిపుణులతో అవుట్ డోర్, ఇండోర్ ఫ్యాకల్టీతో ఫ్రీగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఎలా అప్లయ్‌ చేసుకోవాలి..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా QR కోడ్‌ను స్కాన్ చేసుకుని పేర్లను నమోదు చేసుకోవచ్చని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెల్లడించింది. అభ్యర్థులు తమ సమీప పోలీస్ స్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి.. అలాగే 18 ఏళ్లకు పైగా వయస్సు కలిగి ఉండాలి. పూర్తి వివరాలను కింది ప్రకటనలో చూడొచ్చు.

ఇక్కడ స్కాన్ చేసి రిజిస్టేషన్ చేసుకోగలరు..

Qr Code

రాచకొండ పోలిస్ కమిషనర్ మహెష్ భగవత్ ఆధ్వరంలో ఈ కోచింగ్ ఇవ్వనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భూవనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు, దాతల సహాయ సహకారాలతో పోలీస్ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రాచకొండ పోలీసుల ద్వారా కోచింగ్ తీసుకుని 588 మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇలా ఎంపికైనవారు వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తు్న్నారు.

మహిళల కోసం ప్రత్యేక శిక్షణ..

పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబడింది. దీనితో మహిళలకు కూడా పోలీస్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: INDIA STRATEGY: అమెరికా బెదిరింపులకు జడవని భారత్.. అక్కసు కక్కుతూనే అభినందించిన ఇమ్రాన్.. ఇది కదా దౌత్య నీతంటే..!

Megha Group: హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్.. డ్రిల్‌మెక్‌చే ఇడ్రోజెన స్టార్ట్‌అప్‌ ప్రారంభం