AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వాట్సప్‌ , సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి.. విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..

Pariksha Pe Charcha 2022:పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ.పరీక్షల వేళ వాట్సప్‌ , సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి.. చదువులపై దృష్టి పెట్టండి అని పిల్లలకు పిలుపునిచ్చారు

PM Modi: వాట్సప్‌ , సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి.. విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..
Pariksha Pe Charcha 2022
Sanjay Kasula
|

Updated on: Apr 01, 2022 | 2:34 PM

Share

పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). ఢిల్లీలోని తాలక్​టోరా స్టేడియంలో నిర్వహించిన ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు ప్రధాని మోదీ. కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ-2022(Pariksha Pe Charcha-2022) కార్యక్రమంలో విద్యార్థులను కలుసుకోవటం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు మోడీ. పరీక్షల వేళ వాట్సప్‌ , సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి.. చదువులపై దృష్టి పెట్టండి అని పిల్లలకు సూచించారు ప్రధాని మోదీ. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పిల్లలతో కలిసి ముచ్చటించారు. ఒత్తిడిని జయించడానికి టెక్నిక్స్‌ను పిల్లలకు చెప్పారు మోదీ. పర్యావరణాన్ని కాపాడడానికి విద్యార్ధులు కృషి చేయాలని కోరారు.

అంతకుముందు విద్యార్థులు రూపొందించిన కళాకండాల ప్రదర్శనను తిలకించారు. సమయాభావం వల్ల విద్యార్థుల ప్రశ్నలన్నింటికి ఈ వేదికపై సమాధానం ఇవ్వలేకపోతున్నాని అన్నారు. వీడియో, ఆడియో, సందేశాలు, టెక్ట్స్​ రూపంలో నమో యాప్​ ద్వారా అందిస్తున్నానని అన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో తొలిసారి పరీక్షలకు హాజరవుతున్నవారెవరూ లేరని.. పలుమార్లు పరీక్షలకు హాజరైనందున వాటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు ఒక మెట్టు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండాలి. స్నేహితులను అనుకరించకూడదు. నీకు వచ్చింది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. మీరంతా పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలి. ఆఫ్​లైన్​లో ఎలా జరిగిందో.. ఆన్​లైన్​లోనూ అదే జరుగుతుంది. ఇక్కడ మీడియం ముఖ్యం కాదు. మాధ్యమంతో సంబంధం లేకుండా, విషయాన్ని లోతుగా పరిశోధిస్తే, అర్థం చేసుకోవటంలో తేడా ఉండదన్నారు ప్రధాని మోడీ

విద్యార్థులు ఆన్​లైన్​లో చదువుకుంటున్నప్పుడు తాము సమయాన్ని చదువుకోసం కేటాయిస్తున్నామా.. సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు మోదీ. ఆన్​లైన్​ విద్య.. జ్ఞానాన్ని పొందే సూత్రంపై ఆధారపడి ఉంటుందని.. అయితే.. ఆఫ్​లైన్​ విద్య ఆ జ్ఞానాన్ని కొనసాగిస్తూ ఆచరణలో పెట్టేందుకు ఉపయోగపడుతుందన్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదాను సిద్ధం చేసేందుకు చాలా మంది అందులో పాలుపంచుకున్నారని తెలిపారు. సుమారు 6-7 ఏళ్ల పాటు శోధించి రూపొందించామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు నిపుణుల సూచనలు తీసుకున్నామని చెప్పారు ప్రధాని మోడీ.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..