Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Karnataka Elections: ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య కర్నాటకలో పర్యటిస్తున్నారు రాహుల్‌గాంధీ. ఇటీవల హిజాబ్‌, ఇప్పుడు హలాల్‌ వివాదంతో రాహుల్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..
Rahul Gandhi Visits Shree S
Follow us

|

Updated on: Apr 01, 2022 | 7:18 AM

కర్నాటకలో ముందస్తు ఎన్నికలు(Karnataka Elections) వస్తాయని ప్రచారం ఊపందుకుంది. హిజాబ్‌ వివాదంతో పాటు తాజాగా హలాల్‌ వివాదం తెరపైకి రావడంతో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఎన్నికల కోసమే ఈ వివాదాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల పుకార్లతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్నాటకపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ కర్నాటకలో పర్యటిస్తున్నారు. తుమ్‌కూరులోని శ్రీసిద్ధగంగా మఠాన్ని సందర్శించి, మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు రాహుల్‌గాంధీ. మఠాధిపతులు సాదరంగా రాహుల్‌ను సిద్దగంగా మఠం లోకి ఆహ్వానించారు. మఠంలో పూజలు చేశారు రాహుల్‌. మఠం లోని విద్యార్ధులతో కలిసి సామూహిక ప్రార్ధనలో పాల్గొన్నారు. సిద్దగంగా మఠానికి కర్నాటక రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. లింగాయత్‌ సామాజిక వర్గానికి ఈ మఠం రాజధాని లాంటిది. మఠం ఎలా ఆదేశిస్తే లింగాయత్‌ ఓటుబ్యాంక్‌ అటువైపు వెళ్తుంది. అందుకే రాహుల్‌గాందీ ఈ మఠాన్ని సందర్శించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌టంతో కాషాయ పార్టీపై వ్యతిరేక‌త ఆస‌రాగా జ‌నంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక‌లు రచిస్తోంది.

లింగాయ‌త్‌ల ఓట్ల కోసం రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధగంగ మ‌ఠం పర్యటన కంటే ముందే రాహుల్ ఇక్కడ‌కు రావ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది.

లింగాయ‌త్‌ల జ‌నాభా అధికంగా ఉండ‌టంతో క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో ఈ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునేందుకు రాజ‌కీయ పార్టీలు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తుంటాయి. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ కూడా సంక్షేమ ప‌ధ‌కాల‌తో కూడా ప్రజ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్రయ‌త్నిస్తోంది.

ఇవి కూడా చదవండి: Andhra Pradesh: పశువులకూ సరోగసీ.. మన ఏపీలోనే.. మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని సేకరించి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!