Pension Scheme: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే నెలకు రూ.9,250 పెన్షన్..!
Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు అనుకూలమైన పాలసీలను రూపొందిస్తోంది. కరోనా నుంచి..
Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు అనుకూలమైన పాలసీలను రూపొందిస్తోంది. కరోనా నుంచి పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. గతంలో పాలసీల గురించి పట్టించుకోని వినియోగదారులు ఇప్పుడు పాలసీలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. కరోనా తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ (Insurance Policy)లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఎల్‌ఐసీ నుంచి ఓ కొత్త స్కీమ్ అందుబాటులో ఉంది. దాని పేరు ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పథకం. ఇది వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన పథకం. రిటైర్‌మెంట్ సమయంలో వచ్చిన డబ్బులను ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రతీనెలా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 7.40 శాతం వడ్డీ పొందవచ్చు. అయితే మార్చి 31,2022 చేరిన వారికి 7.40 వడ్డీ అందిస్తోంది. ఏప్రిల్‌లో వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. ఈ వడ్డీ ప్రకారం చూస్తే.. రూ.9,250 పెన్షన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులో ఏప్పుడైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన నెల నుంచే పెన్షన్ పొందే సదుపాయం ఉంటుంది. పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు.
రూ.1,62,162 ఇన్వెస్ట్ చేస్తే..
ఈ పాలసీలో రూ.1,62,162 ఇన్వెస్ట్ చేసిన వారికి నెలకు రూ.1000, మూడు నెలలకు రూ.3000, ఆరు నెలలకు రూ.6000, ఏడాదికి రూ.12,000 చొప్పున పెన్షన్ అందుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారికి గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వారికి 7.40 శాతం వార్షిక వడ్డీ లెక్కించి ప్రతీనెలా పెన్షన్ అందజేస్తుంటారు. నెల నెల రూ.9,250 వస్తుంది. ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఈ పెన్షణ్ స్కీమ్‌లో రూ.30,00,000 వరకు పెట్టుబడి పెట్టి నెలకు రూ.18,500 చొప్పున పెన్షన్ పొందవచ్చు.
పాలసీ గడువు ముగిసిన తర్వాత మొత్తం అమౌంట్ వెనక్కి..
అయితే పాలసీ గడువు ముగిసిన తర్వాత పెట్టిన పెట్టుబడి రూ.15,00,000 వెనక్కి ఇచ్చేస్తారు. ఇందులో 60 ఏళ్లు దాటిన వృద్దులు ఎవరైనా చేరవచ్చు. అంతేకాకుండా మూడేళ్ల తర్వాత రుణం కూడా తీసుకోవచ్చు. గరిష్టంగా 75 శాతం వరకు రుణం ఇస్తారు. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారుడు మరణించినట్లయితే డబ్బులు నామినీకి అందిస్తారు.
ఇవి కూడా చదవండి: