Gas Cylinder Price: బాదుడే.. బాదుడు.. మరో షాకిచ్చిన చమురు సంస్థలు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
Gas Cylinder Price: పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులతో సతమతమవుతున్న ప్రజలకు మరో భారం పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ (Indian Oil) గ్యాస్..
Gas Cylinder Price: పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులతో సతమతమవుతున్న ప్రజలకు మరో భారం పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ (Indian Oil) గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరలను పెంచింది. అయితే ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అలాగే ఏప్రిల్ 1న 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.250 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. అయితే 14 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1002వద్ద నిలకడగా ఉంది. ఈ సిలిండర్ ధర మార్చి 22న రూ.50 పెంచాయి.
ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253 ఉండగా, కోల్‌కతాలో రూ.2,351 ఉంది. ఇక ముంబైలో రూ.2,205 ఉండగా, చెన్నైలో రూ.2,406వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.2,400పైగా ఉంది. అయితే గత రెండు నెలల్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.346 వరకు ఎగబాకింది. అంతకు ముందు మార్చి 1న ఈ సిలిండర్‌పై రూ.105 వరకు పెరిగింది.
ఇవి కూడా చదవండి: