Petrol Diesel Price: దేశ ప్రజలపై క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు..

Petrol Price Today: సామాన్యునిపై బాదుడే బాదుడు..వరుసగా పెట్రోల్‌, డీజిల్ ధరల మోత మోగిపోయిది. పెట్రోల్‌, డీజిల్ ధరలను మరోసారి పెంచేశాయి చమురు కంపెనీలు.

Petrol Diesel Price: దేశ ప్రజలపై క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు..
Petrol Diesel Price
Follow us

|

Updated on: Apr 01, 2022 | 8:20 AM

Petrol Diesel Price Today: సామాన్యునిపై బాదుడే బాదుడు..వరుసగా పెట్రోల్‌, డీజిల్ ధరల మోత మోగిపోయిది. పెట్రోల్‌, డీజిల్ ధరలను మరోసారి పెంచేశాయి చమురు కంపెనీలు. దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు శుక్రవారం, ఏప్రిల్ 1, 2022 కోసం పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని తెలియజేద్దాం. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత 11 రోజుల్లో10వ సారి ధరలు పెంచారు.  రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 22న పెంచబడ్డాయి. .అయితే వాటి ధరలు స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా రెండో వారం. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.42గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.101.58గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.69గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.100.82గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 114.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.77గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.63గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.81గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.52 ఉండగా.. డీజిల్ ధర రూ.100.71గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.02 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.39కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.09లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.115.42 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.27గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.42గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.09గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.116.39లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.102.42లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.81 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.07 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.94 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.111.35 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.22 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 107.45 ఉండగా.. డీజిల్ ధర రూ.97.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107.30 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.91.27గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.66 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.22గా ఉంది.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..

Latest Articles