PAN-Aadhaar Linking: శుభవార్త.. పాన్-ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు.. కానీ..
PAN-Aadhaar Linking: అన్ని డాక్యుమెంట్లలో ఆధార్, పాన్ ఎంతో ముఖ్యమైనవి. ఆధార్ లేనివి ఏ పనులు జరగవు. ఇక ప్రతి దానికి ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాల్సిందే...
PAN-Aadhaar Linking: అన్ని డాక్యుమెంట్లలో ఆధార్, పాన్ ఎంతో ముఖ్యమైనవి. ఆధార్ లేనివి ఏ పనులు జరగవు. ఇక ప్రతి దానికి ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాల్సిందే. ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల్లో పాన్ కార్డు (PAN Card) ఒకటి. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు పాన్ కార్డు కావాల్సిందే. ఇక పాన్ కార్డుకు ఆధార్ నంబర్ (Aadhaar Number) అనుసంధానం చేయడం తప్పనిసరి అయ్యింది. ఇది వరకు ఈ లింక్ చేసుకునేందుకు మార్చి 31, 2022 వరకు గడువు ఉండేది. కానీ ఆ గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోని వారు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మెలిక కూడా పెట్టింది. దానిని పట్టించుకోకపోతే జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే మీరు మీ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోయినా ఎలాంటి సమస్య ఉండదు. పాన్ చెల్లుబాటు అవుతుంది. ఈ గడువు 2023 మార్చి 31 వరకు పొడిగించింది.
అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. మార్చి 31, 2022 వరకు అనుసంధానం చేయని వారికి పాన్ కార్డు చెల్లుబాటు అవుతుంది. కానీ ఏప్రిల్ 1 నుంచి మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2022 మార్చి 29న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల్లోగా (ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోపు) పాన్- ఆధార్ అనుసంధానికి రూ.500 జరిమానా పడుతుంది. మూడు నెలలు దాటితే (జూలై 1 తర్వాత లింక్ చేసుకుంటే) రూ.1000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు 2023 మార్చి 31లోపు కూడా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే అప్పుడు మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాంటి సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేరు. బ్యాంకు అకౌంట్ కూడా తీసుకోలేరు. ఇంకా మరెన్నో ఇబ్బందులు తలెత్త అవకాశం ఉంది. ఇలా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే ఇలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: