Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..

Gowtham Adani: భారత బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రోబల్ కూభేరుల జాబితాలో తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine Crisis) కారణంగా పరిస్థితులు మారినప్పటికీ ఆయన తగ్గేదే లే అన్నట్లు ముందుకు సాగుతున్నారు.

Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..
Adani
Follow us

|

Updated on: Apr 01, 2022 | 10:26 AM

Gowtham Adani: భారత బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రోబల్ కూభేరుల జాబితాలో తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine Crisis) కారణంగా పరిస్థితులు మారినప్పటికీ ఆయన తగ్గేదే లే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. 2022 తొలి మూడు నెలల్లో ఆయన సంపద పెరిగినట్లు తెలుస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికం అదానీ తన సంపదను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా పెంచుకున్నట్లు నివేధికలు చెబుతున్నాయి. అమెజాన్(Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ లను దాటి ఆయన సంపద పెరగుదల నమోదైంది. ఆయన ఆస్తుల విలువ ఈ కాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర పెరిగి మెుత్తం 90 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. 2022 ప్రారంభంలో అదాని రెండో స్థానంలో నిలవగా.. ఆయనకంటే ఎక్కువ సంపాదించటంలో అమెరికన్ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మెుదటి స్థానంలో నిలిచారు. వారెన్ బఫెట్ సంపాదన పెరుగుదల 21.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

అదానీ గ్రూప్ కు చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ విల్మర్ కంపెనీల షేర్ల విలువ 2022లో 103 శాతం మేర పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ వార్, పెరిగిన వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల స్టాక్ మార్కె్ట్లలోని అనేక కంపెనీల విలువలు తగ్గినప్పటికీ అదానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగటం విశేషం. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 1 శాతం పడిపోయింది.

అదానీ ఆస్తుల విలువ గణనీయంగా పెరగటానికి అదానీ విల్మర్ కంపెనీ పెద్ద పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ షేర్ విలువ 100 శాతం మేర పెరగటం వల్ల అందులో గౌతమ్ అదానీకి ఉన్న వాటాల విలువ కూడా భారీగానే పెరిగింది. ఆ తరువాత ఆయన ఆస్తిని పెంచేందుకు అదానీ పవర్, అదానీ ట్రాన్స్ మిషన్ కూడా దోహదపడ్డాయి.

ఇవీ చదవండి..

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..

Mahindra: నూతన సాంకేతికతలోకి అడుగుపెట్టిన మహీంద్రా గ్రూప్.. ఆనంద్ మహీంద్రా ప్రకటన..