Hyderabad: విషాదం.. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
Hyderabad: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్
Hyderabad: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ సంజయ్‌గాంధీ నగర్‌కి చెందిన సయ్యద్అంజద్వృత్తి రీత్యా టైలర్. అతడికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు చాలా రోజుల నుంచి సంబంధాలు వెతుకుతున్నారు. అయితే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదు. అంతేకాక తోటి వారి పెళ్లిళ్లు అవుతున్నా తన పెళ్లి కావడంలేదని సయ్యద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడు.
దీంతో గురువారం ఉదయం సయ్యద్ అంజయ్ ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత సేపటికి గది నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి తలుపులు పగుల కొట్టి లోనికి వెళ్లి చూశారు. అప్పటికే అంజద్ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ నూర్ మహమ్మద్ హైదరాబాద్