Navaratri 2021: రేపు గాయత్రీ అమ్మవారి అలంకారం.. ఏ నైవేద్యం పెట్టాలంటే.. తయారీ విధానం
Navratri 2nd Day Naivedyam: దేశ వ్యాప్తంగా దసరా సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో మహాశక్తి స్వరూపిణి..
Navratri 2nd Day Naivedyam: దేశ వ్యాప్తంగా దసరా సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని తొమ్మిది రోజులు వివిధ రుప్పల్లో అలంకరించి పూజిస్తారు. వీటిని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచీ ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవీ నవరాత్రులలో భాగంగా… అమ్మవారిని ఒక్కోరోజు ఓక్కో రూపంలో పూజిస్తూ.. అమ్మవారికి ఇష్టమైన రంగుతో అలంకరిస్తారు. అదే విధంగా అమ్మవారి అలంకరణతో పాటు నైవేద్యం కూడా నవరాత్రుల్లో ఒకొక్కరోజు ఒకొక్కటి సమర్పిస్తారు. రెండో రోజు అమ్మవారిని గాయత్రిదేవిగా పూజిస్తే.. ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో కొలుస్తారు. ఈరోజు గాయత్రీ దేవికి నైవేద్యంగా పులిహోర, బాలాత్రిపుర సుందరికి అయితే పాయసం, గారెలను నైవేద్యంగా పెడతారు. ఈరోజు పులిహోర తయారీ తెలుసుకుందాం.
కావలిసిన పదార్ధాలు:
బియ్యం- 150 గాం చింతపండు- 50 గ్రాములు గుజ్జు తీసుకోవాలి వేరు శనగ పప్పు- 1/2 కప్పు జీడిపప్పు కొంచెం ఎండుమిర్చి – 5 ఆవాలు -1/2 స్పూన్ మినపప్పు -1 స్పూన్ శనగ పప్పు- 2 స్పూన్ పసుపు- ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి -5 కరివేపాకు -2 రెబ్బలు ఇంగువ- చిటికెడు నూనె కావలిసిన ఉప్పు రుచికి సరిపడా బెల్లం కొద్దిగా
తయారీ విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. బియ్యం ఉడికే సమయంలో కొంచెం నూనె లేదా నెయ్యి వేస్తె..మంచి టెస్ట్ వస్తుంది. తర్వాత అన్నాన్ని చల్లార్చుకుని పసుపు, ఉప్పు కలిపి పక్కకు పెట్టుకోవాలి. అనంతరం చింతపండును అరకప్పు నీళ్ళు పోసి నాన పెట్టి.. చిక్కటి గుజ్జుతీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టుకుని నాలుగు స్పూన్ల నూనె వేసి అందులో పచ్చి మిర్చి, ఆవాలు ,ఎండుమిర్చి, వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించుకోవాలి. ఇపుడు ఇలా ఉడికిన గుజ్జులో అన్నంలో కలపండి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , జీడిపప్పు వేసుకుని తరువాత వేరు శనగ గుళ్ళు వేసి పోపుని వేయించుకోవాలి చివరగా కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత చింతపండు గుజ్జు కలుపుకున్న అన్నంలో ఈ పోపు వేసుకుని కలుపుకోవాలి. అంతే కమ్మటి పులిహోర రెడీ. గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులను పొందండి.
రెస్క్యూ టీమ్ మధ్య క్యూట్ క్యూట్‌గా గున్న ఏనుగు.. తల్లిదగ్గరకు చేరిన వీడియో వైరల్