మహిళా వార్డు వాలంటీర్ దారుణ హత్య..
విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టు..సహజీవనం చేస్తున్న మహిళను ఇనుపరాడ్డుతో తలపై మోది కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే..నర్సీపట్నంలోని 22వ వార్డు వాలంటీర్‌గా రెడ్డి దేవి అనే మహిళ పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు ఓ టీవీ చానల్ జర్నలిస్ట్‌గా పనిచేస్తోన్న వివాహితుడైన మురళితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి కారణమైంది. దీంతో ఈ జంట పెదబొడ్డేపల్లిలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే […]
విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టు..సహజీవనం చేస్తున్న మహిళను ఇనుపరాడ్డుతో తలపై మోది కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే..నర్సీపట్నంలోని 22వ వార్డు వాలంటీర్‌గా రెడ్డి దేవి అనే మహిళ పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు ఓ టీవీ చానల్ జర్నలిస్ట్‌గా పనిచేస్తోన్న వివాహితుడైన మురళితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి కారణమైంది. దీంతో ఈ జంట పెదబొడ్డేపల్లిలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో దేవిపై మురళికి అనుమానం స్టార్టయ్యింది. ఆమె మరో వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో..ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. మంగళవారం దేవి..తన అమ్మగారి ఊరు వెళ్లగా..మురళి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఎప్పట్లాగే ఇరువురు గొడవకు దిగారు. మురళి మద్యం సేవించి తనను ఇబ్బందిపెడుతున్నాడంటూ దేవి పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో కోపోద్రేక్తుడైన మురళి పక్కనే ఉన్న ఇనుపరాడ్డుపై ఆమె తలపై బలంగా బాదడంతో..ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నిందితుడు మురళి స్పాట్ నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా దేవి చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.