పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం: యువతి కన్నుమూత

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ ఎదుట లోకేశ్వరి అనే యువతి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రవీణ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఆ యువతి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 35 శాతానికి పైగా కాలిపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ లోకేశ్వరి మరణించింది. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులకు […]

పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం: యువతి కన్నుమూత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 01, 2020 | 3:40 PM

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ ఎదుట లోకేశ్వరి అనే యువతి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రవీణ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఆ యువతి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 35 శాతానికి పైగా కాలిపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ లోకేశ్వరి మరణించింది. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. కాగా ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోన్న లోకేశ్వరి.. గతంలోనూ పంజాగుట్ట పీఎస్‌లో పలు కేసులు పెట్టింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.