కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం.. ముగ్గురి దుర్మరణం
కొత్త సంవత్సరం రోజున నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలంలో తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యి మరణించారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతి జీవకోనకు చెందిన కొంతమంది నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు తూపాలిపాలెం బీచ్‌కు వచ్చారు. అర్ధరాత్రి సముద్రం వద్ద కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత సరదాగా సముద్రంలోకి వెళ్లారు. అయితే అప్పటికే అలల ఉధృతి […]
కొత్త సంవత్సరం రోజున నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలంలో తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యి మరణించారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతి జీవకోనకు చెందిన కొంతమంది నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు తూపాలిపాలెం బీచ్‌కు వచ్చారు. అర్ధరాత్రి సముద్రం వద్ద కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత సరదాగా సముద్రంలోకి వెళ్లారు. అయితే అప్పటికే అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో.. సముద్రంలోకి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆ ముగ్గురి మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.