బాబు నోట మళ్ళీ తెలంగానం.. అభివృద్ధి నేనే చేశా!

టీడీపీ అధినేత చంద్రబాబు నోట మరోసారి తెలంగాణ రాగం వినిపించింది. ఇంతకాలం కేవలం హైదరాబాద్ అభివృద్ది తన వల్లే అయ్యిందని చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు నూతన సంవత్సరారంభం రోజున యావత్ తెలంగాణ అభివృద్ధి తన విజన్ వల్లే జరిగిందని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంత ప్రజలకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనవరి ఒకటిన రాజధానికి భూములిచ్చిన రైతుల మధ్య గడుపుతున్నారు. కొత్త సంవత్సరం ఉదయాన్నే బెజవాడ కనకదుర్గను సతీమణి భువనేశ్వరితో […]

  • Rajesh Sharma
  • Publish Date - 12:31 pm, Wed, 1 January 20
బాబు నోట మళ్ళీ తెలంగానం.. అభివృద్ధి నేనే చేశా!

టీడీపీ అధినేత చంద్రబాబు నోట మరోసారి తెలంగాణ రాగం వినిపించింది. ఇంతకాలం కేవలం హైదరాబాద్ అభివృద్ది తన వల్లే అయ్యిందని చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు నూతన సంవత్సరారంభం రోజున యావత్ తెలంగాణ అభివృద్ధి తన విజన్ వల్లే జరిగిందని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంత ప్రజలకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనవరి ఒకటిన రాజధానికి భూములిచ్చిన రైతుల మధ్య గడుపుతున్నారు. కొత్త సంవత్సరం ఉదయాన్నే బెజవాడ కనకదుర్గను సతీమణి భువనేశ్వరితో కలిసి సందర్శించుకుని, పూజాధికాలు నిర్వహించిన చంద్రబాబు.. ఆక్కడ్నించి నేరుగా ఎర్రబాలెంలో రైతుల దీక్ష శిబిరం వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అక్కడ్నించి రాజధాని ఏరియా గ్రామాల సందర్శనకు చంద్రబాబు దంపతులు బయలుదేరారు.

ఎర్రబాలెం నుంచి కృష్ణాయపాలెం,మందడంలో చంద్రబాబు దంపతుల పర్యటిస్తున్నారు. అమరావతిని పరిరక్షించాలి, రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ భావితరాల భవిష్యత్తును కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు. తెలంగాణా రాష్ట్రం అభివ‌ృద్ధికి తన విజనే కారణమని మరోసారి చాటారు చంద్రబాబు. అన్ని మతాల దేవుళ్ళని ఒక్కటే కోరుతున్నానని.. ముఖ్యమంత్రి జగన్‌కి, మంత్రులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నానని చెప్పారాయన.