మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు.. అందరూ లొంగిపోవాల్సిందేనన్న డీజీపీ మహేందర్ రెడ్డి

Maoist Ravula Ranjith Surrender: తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు స్థానం లేదని.. అందరూ లొంగిపోవాల్సిందేనని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు

మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు.. అందరూ లొంగిపోవాల్సిందేనన్న డీజీపీ మహేందర్ రెడ్డి
Maoist Ravula Ranjith Surrender
Follow us

|

Updated on: Jul 14, 2021 | 1:23 PM

Maoist Ravula Ranjith Surrender: తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు స్థానం లేదని.. అందరూ లొంగిపోవాల్సిందేనని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని వారంతా లొంగిపోవాలని ఆయన సూచించారు. వీరిలో 11 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మరో ముగ్గురు ఏపీకి చెందిన వారున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మావోయిస్టు కమిటీలో 120 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జ్ సెక్రెటరీగా దామోదర్ కొనసాగుతున్నాడని.. వారంతా లొంగిపోయి జనజీవన స్రవంతి కలవాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. లొంగిపోయిన వారికి 4 లక్షల పరిహారంతో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నామని తెలిపారు. బుధవారం రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎదుట మావోయిస్టు నేత‌, ప్లాటూన్ పార్టీ క‌మిటీ మెంబ‌ర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్‌ దండకారణ్యం బెటాలియన్‌ కమిటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు.

కాగా రెండు సంవత్సరాల క్రితం రంజిత్ తండ్రి, మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న ఆనారోగ్య సమస్యతో చనిపోయారు. రావుల రంజిత్ కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధ ప‌డుతుండటంతో ఆయ‌న లొంగిపోయాడు. కాగా రంజిత్‌ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం. 1998 లో రావుల రంజిత్ జన్మించాడు. చిన్నప్పటి నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ.. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ చేరాడు. అనంతరం 2019 లో గుండెపోటుతో రంజిత్ తండ్రి రామన్న చనిపోయాడు. అయితే.. తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ క్రమంలో పార్టీ సరైన గుర్తింపునివ్వకపోవడం.. లొంగుబాటుకు అంగీకరించకపోవడంతో లొంగిపోయినట్లు రంజిత్ పేర్కొన్నాడు. 2017 నుంచి 2019 ఆమ్స్ బెటాలియన్లో పని చేసిన రంజిత్ 2018 కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు. 2021లో జీరం అటాక్‌లో సైతం పాల్గొన్నాడు.

అయితే.. కోవిడ్‌తో అనేక మంది మావోయిస్టులు చనిపోయారని రంజిత్ తెలిపాడు. హరిభూషణ్, భారతక్క కరోనాతో చనిపోయారని రంజిత్ తెలిపాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నేతలందరూ లొంగి పోవాలని రంజిత్ కోరాడు.

Also Read:

అమెరికాలో విషాదం.. జలపాతంలో పడి ఆదిలాబాద్ వాసి మృతి.. తల్లిదండ్రుల కళ్లెదుటే ఘటన

Pakistan Bus Blast: పాకిస్తాన్ లో బస్సు పేలుడు..8 మంది మృతి.. మృతుల్లో చైనా ఇంజనీర్లు, పాక్ సైనికులు