Tuni: డాక్టర్ల నిర్లక్ష్యం..! ఆ ఇంజెక్షన్‌తో నీలం రంగులోకి చిన్నారి శరీరం.. ఆపై మృతి..
వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నాలుగు రోజుల శిశువుకు యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడంతో పసికందు మృతి చెందాడని..
వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నాలుగు రోజుల శిశువుకు యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడంతో పసికందు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు బాలుడి పేరెంట్స్. ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తునిలోని పాండురంగా ప్రైవేట్ హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగింది. యాంటిబయోటిక్ ఇంజక్షన్ ఇచ్చి అన్యాయంగా తమ కొడుకును చంపేశారని పాప తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, బంధువులతో ఆందోళనకు దిగింది. పుట్టిన తర్వాత బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, అయితే వైద్యులు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే నీలం రంగులోకి మారిపోయి మృతి చెందాడని బాలుడి తల్లి చెబుతోంది. బిడ్డను అన్యాయంగా చంపేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
అల్వాల్‌లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి
మద్యం సేవించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోయాడు. సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలోని దుర్గా వైన్స్ వద్ద ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓల్డ్ ఆల్వాల్ హరిజన బస్తీకి చెందిన కొండలు అనే వ్యక్తి మద్యం సేవిస్తూ వైన్ షాపు వద్దే ప్రాణాలు విడిచాడు. నగరంలోని ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన కొండలు… కూలీ పని చేసేవాడని పోలీసులు తెలిపారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో మద్యం తాగేందుకు దుర్గా వైన్స్ షాపు వద్దకు చేరుకున్నాడు. పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న మృతుడి తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె రోదించిన తీరు పలువురి మనసులను కదిలించింది.
Also Read: రామయ్య జెండాలతో చంద్రన్నకు ఆహ్వానం.. మచిలీపట్నంలో ఇంట్రస్టింగ్ సీన్