Jr NTR Flags: రామయ్య జెండాలతో చంద్రన్నకు ఆహ్వానం.. మచిలీపట్నంలో ఇంట్రస్టింగ్ సీన్
మళ్లీ తారకమంత్రం జపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మచిలీపట్నంలో ఇటీవలే చనిపోయిన టీడీపీ నేత కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యుల్ని..
మళ్లీ తారకమంత్రం జపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మచిలీపట్నంలో ఇటీవలే చనిపోయిన టీడీపీ నేత కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లారు. ఈనేపథ్యంలోనే అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు.. పార్టీ జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న జెండాలను పట్టుకొని నిల్చున్నారు. ఒకవైపు ‘జై బాబు, జైజై బాబు’ అంటూనే మరోవైపు… ‘నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ.. స్లోగన్స్‌తో హోరెత్తించారు. కాగా ఈ మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఇలాంటి సీన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆమధ్య చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పంలో కూడా తారక్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తమ్ముళ్లు. అయితే దీనిపై చంద్రబాబు అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. మరి అవే సీన్స్ పదే, పదే రిపీట్ అవడంపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తారక్ జెండాలను చూసి టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు అందులో తప్పేముందని ఆఫ్ ది టాక్ చెబుతుండగా.. మరికొందరు అంత హడావిడి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం పార్టీకి ఎన్టీఆరే ఊపిరంటున్న క్యాడర్… రాజకీయాలవైపు ఇప్పుడే వద్దంటున్న ఫ్యాన్స్..
జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్త కాదన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన టీడీపీ తరఫున ప్రచారం చేశారు కూడా. ఆ తర్వాత దూరం జరిగారు. అయితే.. టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా రియాక్టయ్యే అవకాశం ఉంది.. తన తాతగారు పెట్టిన పార్టీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాజకీయంలోకి వస్తారా.. రారా? అనే సందేహాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, ఇదే సమయంలో మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తారక్ రాజకీయాల్లోకి రావద్దని కోరుతున్నారు. సినిమాల్లోనే కొనసాగాలని వారు ఎన్టీఆర్ కు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలన్న కొందరి ప్రయత్నాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు తమ అభిమాననటుడుకి తమ వెర్షన్ సోషల్ మీడియా వేదికగానూ వివరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? రాజకీయాలపై ఆయన ఫోకస్ ఎలా ఉంది? అనే అంశాలు ప్రస్తుత చర్చలో భాగం అయ్యాయి. గతంలో ఎన్టీఆర్ పార్టీ మారాతారన్న ప్రచారం జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రూమర్స్ కొట్టిపడేశారు. ఇప్పుడు ఇంతలా వస్తున్న ఒత్తిడికి ఆయన ఎలా చెక్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: కిడ్నీలు అమ్మి అప్పులు కట్టాలనుకున్నారు.. వాళ్లనూ దోచేశారు సైబర్ కేటుగాళ్లు.