AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan Fan: అవధులు లేని అభిమానం.. సీఎం జగన్‌ను కలిసేందుకు తెలంగాణ యువకుడి పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 80 శాతం సీట్లు, 50 శాతం ఓట్లతో గత సార్వత్రిక....

CM Jagan Fan: అవధులు లేని అభిమానం.. సీఎం జగన్‌ను కలిసేందుకు తెలంగాణ యువకుడి పాదయాత్ర
Cm Jagan Fan
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2021 | 11:26 AM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 80 శాతం సీట్లు, 50 శాతం ఓట్లతో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన జగన్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపారు. ఈ తర్వాత కూడా మేనిఫెస్టోలో పొందిపరిచిన నవరత్నాలను చెప్పిన విధంగా అమలు చేస్తూ మాట మీద నిలబడిన వ్యక్తిగా జేజేలు అందుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్‌ను అభిమానించేవారు ఎందరు ఉన్నారో చెప్పడానికి గత ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అయితే ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ జగన్‌కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా జగన్‌కు అభిమానించేవారు చాలామంది ఉన్నారు. జగన్ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పాదయాత్రలు కూడా చేస్తున్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో, ఆయన్ని ఒక్కసారైనా నేరుగా చూడాలన్న ఆశతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు పాదయాత్రకు పూనుకున్నాడు.

ఈనెల 8వ తేదీన దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జగన్ కోసం పాదయాత్ర ప్రారంభించాడు. తన స్వగ్రామం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు కాలినకడన బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం, మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్‌ అనే యువకుడు ఏపీ సీఎం జగన్ కోసం ఇలా పాదయాత్ర చేయడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫైనల్‌గా అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

Also Read: కుందేలును వెంటాడి నోట పట్టిన చిరుత.. ఇంతలో ఆపద్బాంధవుడిలా వచ్చిన అడవి పంది

అకస్మాత్తుగా ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ వీడియో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది..