Viral Video: అకస్మాత్తుగా ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ వీడియో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది..
ఎక్కడైతే వర్షం పడుతుందో, ఆ ప్రాంతంలో వాతావరణం ఖచ్చితంగా ఆహ్లాదకరంగా మారుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఆకాశం నుండి వర్షం పడటం సాధారణం.
ఎక్కడైతే వర్షం పడుతుందో, ఆ ప్రాంతంలో వాతావరణం ఖచ్చితంగా ఆహ్లాదకరంగా మారుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఆకాశం నుండి వర్షం పడటం సాధారణం. అయితే చేపలు వర్షం గురించి చెప్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఉటాలో అలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. చేపల ఉనికిని సజీవంగా ఉంచడానికి ఉటాలోని ఒక సరస్సులో చేప పిల్లల వర్షం కురిపించారు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానం సహాయంతో 35 వేల చేప పిల్లలను సరస్సులోకి జారవిడిచారు. కాగా ఇలా చేసే సమయంలో, వారు చాలా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. విమానం తలుపులు తెరవడానికి ముందు, అది సరస్సు నుండి చాలా తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్తపడతారు. ఒకవేళ ఎత్తు ఎక్కువ ఉంటే చేపలు చనిపోయే అవకాశం ఉంది. ఈ చేపలు ఒకటి నుండి మూడు అంగుళాల పొడవు ఉంటాయి. చేప పిల్లలను పెద్ద బకెట్‌లో ఉంచి విమానంలోకి ఎక్కించుకుంటారు. విమానం సరస్సు ఉన్న ప్రాంతం వద్దకు చేరుకున్నప్పుడు, పైలట్లు తలుపులు తెరిచి చేపలను విసిరివేస్తారు. ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు.
అసలు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందంటే.. ఈ సరస్సు ఉన్న ప్రదేశం వద్దకు వాహనాలు వెళ్లే అవకాశం లేదు. దీంతో, విమానం సహాయం ఇక్కడ తీసుకున్నారు. అయితే, ఈ వీడియో చూసిన తరువాత, చేపలు బతికి ఉన్నాయా లేదా అనే భయం చాలా మందికి వచ్చింది. కాగా 95 శాతం చేపలు సజీవంగా సరస్సుకి చేరుకున్నాయని తర్వాత ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్ సెంటర్‌గా తిరుపతి.. వందల మందిని బకరా చేసి… లక్షలు దోచేసిన ముఠా