Bonalu: బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తా : కేంద్రమంత్రి

దేశంలో ఎక్కడలేని విధంగా బోనాలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు...

Bonalu: బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తా : కేంద్రమంత్రి
Kishan Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 14, 2021 | 10:03 AM

Kishan Reddy: దేశంలో ఎక్కడాలేని విధంగా బోనాలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రధాని నరేంద్రమోదీ తరఫున బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారాయన. పంటలను రక్షించాలని, రోగాల నుంచి రక్షించాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుగుతాయన్న కిషన్ రెడ్డి, కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని వెల్లడించారు.

బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి మాటిచ్చారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని, గత ఏడాది నుంచి కరోనా కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం లేకపోయిందని కిషన్ రెడ్డి అన్నారు. సాధారణ పరిస్థితుల్లో భారీ ఎత్తున మహిళలు, ప్రజలు బోనాల పండుగలో పాల్గొంటూ ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

Read also: Borra Caves: బొర్రాగుహల ప్రాంతంలో స్టోన్‌ మాఫియా, రంగురాళ్లకోసం యధేచ్చగా తవ్వకాలు, పొంచి ఉన్న ముప్పు.!