TPCC: హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ లు, సమన్వయ కర్తలు, మండల బాధ్యులను ప్రకటించిన టీపీసీసీ
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించింది.
Huzurabad Incharges: హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ను నియమించారు. నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లను నియమితులయ్యారు. నియోజయవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇంచార్జ్ ల పూర్తి జాబితా ఇలా ఉంది.
నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలు : జీవన్ రెడ్డి, ఎమ్యెల్సీ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, మాజీ ఎం.పీ
వీణవంక మండలం ఇంచార్జులు : ఆది శ్రీనివాస్ సింగీతం శ్రీనివాస్
జమ్మికుంట మండలం : విజయ రమణ రావ్ రాజ్ ఠాగూర్
హుజురాబాద్ మండలం: టి. నర్సారెడ్డి లక్ష్మణ్ కుమార్
హుజురాబాద్ టౌన్ : బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
ఇల్లంతకుంటా మండలం: నాయిని రాజేందర్ రెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కమలపూర్ మండలం : కొండా సురేఖ దొమ్మటి సాంబయ్య
కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త : కవ్వంపల్లి సత్యనారాయణ
Read also: APSRTC: MD: ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి శుభవార్తలు చెప్పిన సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు