Pakistan Bus Blast: పాకిస్తాన్ లో బస్సు పేలుడు..8 మంది మృతి.. మృతుల్లో చైనా ఇంజనీర్లు, పాక్ సైనికులు
నార్తర్న్ పాకిస్తాన్ లో బుధవారం చైనా ఇంజనీర్లు, పాక్ సైనికులతో వెళ్తున్న బస్సు 8 పేలిపోగా 8 మంది మృతి చెందారు. వీరిలో నలుగురు ఇంజనీర్లు, కొందరు పాక్ సైనికులు ఉన్నారు. దుండగులు ఈ బస్సును టార్గెట్ చేజేసి పేల్చి వేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడినవారిలో....
Pakistan Bus Blast: నార్తర్న్ పాకిస్తాన్ లో బుధవారం చైనా ఇంజనీర్లు, పాక్ సైనికులతో వెళ్తున్న బస్సు 8 పేలిపోగా 8 మంది మృతి చెందారు. వీరిలో నలుగురు ఇంజనీర్లు, కొందరు పాక్ సైనికులు ఉన్నారు. దుండగులు ఈ బస్సును టార్గెట్ చేజేసి పేల్చి వేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది. దాసు డ్యాం వద్ద పనులకు వెళ్తున్న సుమారు 30 మంచి చైనా ఇంజనీర్లు, వర్కర్లు ఈ బస్సులో ఉన్నట్టు సమాచారం. అప్పర్ కొహెస్తాన్ ప్రాంతంలో వెళ్తున్న ఈ బస్సు పెద్దగా పేలిపోయింది, ఆ వెంటనే లోతైన లోయలో పడిపోయిందని హజారీ రీజన్ కు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇద్దరు పారా మిలిటరీ ఉద్యోగులు కూడా ఈ ఘటనలో మరణించారన్నారు. చైనాకు చెందిన ఓ ఇంజనీర్, ఓ సైనికుడు గల్లంతయ్యారన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే లాహోర్ లో జరిగిన పేలుడు ఘటన మరిచిపోక ముందే ఈ బ్లాస్ట్ జరగడం ప్రభుత్వ వర్గాలను కలవరపరుస్తోంది..
కాగా-దాసు హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు..చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగమని, 65 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పశ్చిమ ప్రాంత చైనాను, సదర్న్ పాకిస్తాన్ లోని గ్వాడార్ సీ పోర్టునుకలిపే బృహత్తర ప్రాజెక్టు ఇదని తెలిసింది. ఈ ప్రాజెక్టు పనుల్లో కొన్నేళ్లుగా చైనా ఇంజనీర్లు, పాక్ నిర్మాణ రంగ కార్మికులు, ఇతరులు ఇక్కడ పని చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉంచిన పేలుడు డివైజ్ కారణంగా ఈ ఘటన జరిగిందా లేక.. బస్సులోని డివైజ్ ఏదైనా పేలిపోయిందా అన్న విషయం ఇంకా తెలియడంలేదు. సహాయ చర్యలను ఉధృతం చేసినట్టు అధికారులు చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మరింత ముందుగానే థర్డ్ వేవ్..?మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. :Corona 3rd Wave Live Video.
సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.
Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్..(వీడియో).
థర్డ్ వేవ్ షురూ.. మహారాష్ట్ర లో మళ్ళీ పుంజుకుంటున్న కోవిడ్ కేసులు..:Third Wave Of Corona Video.