కోవిడ్ పాండమిక్ అదుపులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సాయం కోరిన ఆస్ట్రేలియన్ ఎంపీ..ప్రశంసల వర్షం

యూపీలో కోవిడ్ పాండమిక్ ని అదుపు చేయడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన కృషి చేశారని ఆస్ట్రేలియన్ ఎంపీ క్రేగ్ కెల్లీ ప్రశంసించారు. తమ దేశంలో దీన్ని తమ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతోందని..ఇది అసమర్థ ప్రభుత్వమని విమర్శిస్తూ ట్వీట్ చేసిన ఆయన..

కోవిడ్ పాండమిక్ అదుపులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సాయం కోరిన ఆస్ట్రేలియన్ ఎంపీ..ప్రశంసల వర్షం
Australian Mp Craig Kelly Seeks Up Cms Help In Tackling Covid Pandemic,australian Mp Craig Kelly,covid Pandamic,control,up Cm Yogi Adityanath,competent Management,kelly Tweet,
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 11:50 AM

యూపీలో కోవిడ్ పాండమిక్ ని అదుపు చేయడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన కృషి చేశారని ఆస్ట్రేలియన్ ఎంపీ క్రేగ్ కెల్లీ ప్రశంసించారు. తమ దేశంలో దీన్ని తమ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతోందని..ఇది అసమర్థ ప్రభుత్వమని విమర్శిస్తూ ట్వీట్ చేసిన ఆయన.. యోగి తమకు సాయపడాలని కోరారు. వెల్ డన్ టు ఇండియాస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ ఇట్స్ చీఫ్ మినిష్టర్ యోగి ఆదిత్యనాథ్ అని కొనియాడారు. కోవిడ్ వేవ్ ని అణచివేయడంలో యోగి నేతృత్వంలోని మేనేజ్ మెంట్ అత్యంత సమర్థంగా చర్యలు తీసుకోగలిగిందన్నారు. హెల్త్ వర్కర్లు,పేషంట్లు, వైరస్ కి గురైనవారి పట్ల ఆయన ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు భేష్ అని క్రేగ్ కితాబిచ్చారు.యోగి ఆదిత్యనాథ్ సాయం తీసుకునే అవకాశం మాకుండాలి అన్నారు.

గత ఏప్రిల్ నెలలో సెకండ్ వేవ్ ఇండియాలో ఉధృతంగా ఉన్నప్పుడు రోజుకు సుమారు 3 లక్షల కోవిడ్ కేసులు నమోదవుతుండగా దేశ జనాభాలో 17 శాతం జనాభా ఉన్న యూపీలో కేవలం ఒక శాతం కేసులు నమోదైనట్టు వార్తలు వచ్చాయి. నాడు ‘ఇవర్ మెక్టిన్’ అనే మెడిసిన్ వినియోగాన్ని యూపీ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రవేశపెట్టి వేలమంది కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడిందని ఆ వార్తలు పేర్కొన్నాయి. కాగా ఆస్ట్రేలియాలో కేసులు పరిమితంగానే ఉన్నప్పటికీ ఆ దేశ ఎంపీ యూపీ ముఖ్యమంత్రి పని తీరు పట్ల ఇంప్రెస్ కావడం విశేషం. ఛాంపియన్ ఆఫ్ యూజింగ్ ఇవర్ మెక్టిన్ అని యోగిని క్రేగ్ కెల్లీ పొగుడుతూ ఆ మెడికేషన్ ని రిలీజ్ చేయడంలో ఆయన సహాయాన్ని తాము కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఏమైనా…. ఇది ఇండియా పట్ల ప్రశంశనీయ ట్వీట్ అని అభివర్ణిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : మరింత ముందుగానే థర్డ్ వేవ్..?మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. :Corona 3rd Wave Live Video.

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.

 Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌..(వీడియో).

 థర్డ్ వేవ్ షురూ.. మహారాష్ట్ర లో మళ్ళీ పుంజుకుంటున్న కోవిడ్ కేసులు..:Third Wave Of Corona Video.