AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలెర్ట్.. అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

JEE Main Admit Card 2021 Released: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగా

JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలెర్ట్.. అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?
Jee Main
Shaik Madar Saheb
|

Updated on: Jul 14, 2021 | 12:14 PM

Share

JEE Main Admit Card 2021 Released: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగా జేఈఈ మెయిన్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. మూడో విడత అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జేఈఈ మూడో విడుత పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షను ఈనెల 20, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా.. ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే ఈ జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు విడుతలుగా నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే మొదటి రెండు సెషన్లను నిర్వహించింది. మూడు, నాలుగో సెషన్లు ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ క్రమంలో ఎన్‌టీఏ మూడో విడుత పరీక్ష తేదీలను ప్రకటించింది. కరోనా నిబంధనలతో పరీక్షలను పకడ్బంధీగా నిర్వహిచేందుకు పరీక్ష కేంద్రాలను పెంచారు.

అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ∙ ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic ను సందర్శించాలి ∙ అడ్మిట్ కార్డు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ∙ తరువాత వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి. ∙ అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. ∙ డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసుకోని తీసుకోవాలి.

నేటితో ముగియనున్న నాలుగో విడత దరఖాస్తు గడువు.. ఇదిలాఉంటే.. నాలుగో విడుత జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌తోపాటు ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు

Also Read:

Murder: ప్రేమ పేరుతో వేధింపులు.. వెంటాడి హత్య.. యువతిని గొడ్డలితో దారుణంగా నరికిన ఉన్మాది

Bride Viral Video: కారు బానట్‌పై పెళ్లి కూతురు.. సరదాగా తీసుకున్న వీడియో చిక్కుల్లో పడేసింది..