AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం! టమాటా లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపి..

తిరువన్నామలైలో దారుణం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. గూడ్స్ వాహనం ఆపి తనిఖీల పేరుతో ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. స్థానికుల చొరవతో బాధితురాలు రక్షించబడింది. నిందితులైన కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ పరారీలో ఉన్నారు.

ఆంధ్రా యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం! టమాటా లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపి..
Crime News
SN Pasha
|

Updated on: Sep 30, 2025 | 5:47 PM

Share

పోలీసులంటే ప్రజలను రక్షించేవారు. కానీ ఇక్కడ పోలీసులే రాక్షసులుగా మారారు. కామంతో కళ్లు ముసుకుపోయిన పోలీసులకు వాళ్లు యూనిఫామ్‌లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువన్నమలై (అరుణాచలం)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై పోలీసులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంథాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో టమాటాలు తీసుకెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసినా ఇద్దరు కానిస్టేబుల్స్ అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ ఆమెను కిందకు దింపారు.

ఆ తర్వాత ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్ళి ఇద్దరు కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఆ యువతి కేకలు విని, ఆమెను ఆ కామాంధుల చెర నుంచి రక్షించి అంబులెన్స్‌లో తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..