Shah Rukh Khan Son: ఆర్యన్‌ఖాన్‌ s/o షారూక్‌. నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిస. ఇండియా, ఫారిన్.. ఎక్కడికెళ్లినా భారీ వినియోగం.!

మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. చిన్నప్పుడే పిల్లల్ని గాడిలో పెట్టకపోతే పెద్దయ్యాక అది అసాధ్యం. అయితే పిల్లలు సక్రమమైన దారిలో ఉండాలని

Shah Rukh Khan Son: ఆర్యన్‌ఖాన్‌ s/o షారూక్‌. నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిస. ఇండియా, ఫారిన్.. ఎక్కడికెళ్లినా భారీ వినియోగం.!
Aryan Khan And Sharukh Khan
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 04, 2021 | 11:34 AM

Aryan Khan: మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. చిన్నప్పుడే పిల్లల్ని గాడిలో పెట్టకపోతే పెద్దయ్యాక అది అసాధ్యం. అయితే పిల్లలు సక్రమమైన దారిలో ఉండాలని కోరుకునే పెద్దలకే ఇదంతా. ఆర్యన్‌ ఖాన్‌ విషయంలో షారూక్‌కు ఈ మాట వర్తింస్తుందా అంటే.. 20ఏళ్ల నాటి షారూఖ్ చేసి ఓ కామెంట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆర్యన్‌ఖాన్‌ సన్నాఫ్‌ షారూక్‌ ఖాన్‌.. నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిస. ఇండియాలో ఉండగానే కాదు.. దుబాయ్, యూకే ఎక్కడికి వెళ్లినా అతని డ్రగ్స్ వినియోగం భారీగా ఉంటుందని చెబుతోంది NCB. 15ఏళ్లుగా అతనికి మిత్రుడైన అర్బాజ్‌తో కలిసే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కూడా తేలుతోంది.

ఇక, ముంబైలోని క్రూయిజ్‌లో భారీ రేవ్‌ పార్టీ జరిగింది. అందులో డ్రగ్స్ వినియోగం కూడా ఓ రేంజ్‌లో జరిగింది. డ్రగ్స్ తీసుకుంటున్న మొత్తం 8మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. అందులో ఆర్యన్ సహా మరో ఇద్దర్ని పోలీసులు కస్టడీకి తీసుకుంది. ఎన్సీబీ ఇంటరాగేషన్‌లో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆర్యన్‌ ఖాన్ నాలుగేళ్లుగా డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. దుబాయ్, యూకే వెళ్లినప్పుడు ఆర్యన్ డ్రగ్స్ తీసుకునేవాడని ఎన్సీబీ తేల్చింది.

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్ అరెస్ట్‌ బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్యన్‌ అరెస్ట్‌తో బాలీవుడ్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. షారుక్ సన్నిహితులు, స్నేహితులు… అతని నివాసానికి క్యూ కట్టారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా షారుక్ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఖాన్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆర్యన్ నిన్నట్నుంచి భోజనం కూడా చేయలేదు. ఎన్సీబీ ఇచ్చిన ఆహారాన్ని తినేందుకు ఆర్యన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్సీబీ ఇంటరాగేషన్‌లోనూ ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడు. ఏం అడిగినా ఏడుపు తప్ప… ఎలాంటి సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది.

ఇలాఉండగా, కొడుకు ఆర్యన్‌ ఖాన్‌తో షారుక్ ఖాన్ ఫోన్లో మాట్లాడారు. రెండే రెండు నిమిషాలు ఆర్యన్‌తో మాట్లాడేందుకు ఎన్సీబీ అధికారులు అనుమతి ఇచ్చారు. ల్యాండ్ లైన్ ద్వారా ఆర్యన్‌తో మాట్లాడే అవకాశం కల్పించారు.

Read also: UP: లఖీంపూర్ టు లక్నో.. రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో యూపీలో హైటెన్షన్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!