రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రేమ జంట.. రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోతుండగా ఘటన..
రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్రంగా గాయపడిన ఘటన ఇది. ఇంటి నుంచి వారు కారులో పారిపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్రంగా గాయపడిన ఘటన ఇది. ఇంటి నుంచి ప్రేమ జంట కారులో పారిపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేరళలో ఆదివారం జరిగిన ఈ కారు ప్రమాదంలో ప్రేమ జంటకు స్నేహితులైన ఇద్దరు యువకులు కూడా గాయపడ్డారు. కొట్టాయంకు చెందిన 18 ఏళ్ల యువతి, విలింజమ్‌కు చెందిన షమీర్(24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి అమ్మాయి కుటుంబీకులు నిరాకరించడంతో కారులో తమ ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకునేందుకు యత్నించారు. వారి వాహనం రోడ్డు పక్కన గోడను బలంగా ఢీకొనడంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు నిర్ధారించుకున్న పోలీసులు.. వారి ఇళ్లకు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదం గురించి తెలియజేశారు. పోలీసులు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పే వరకు అమ్మాయి కుటుంబీకులకు ఆమె ఇంట్లో నుంచి తన ప్రియుడితో కలిసి పారిపోయిన విషయం తెలియకపోవడం విశేషం.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోషల్ మీడియా ద్వారా షమీర్‌కు 18 ఏళ్ల అమ్మాయితో కొన్ని మాసాల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగిన వారిద్దరూ.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారాన్ని షమీర్ కుటుంబీకులు అమ్మాయి కుటుంబానికి తెలియజేశారు. అయితే ఆమెకు 18 ఏళ్ల వయస్సే కావడంతో.. మరో రెండేళ్లు గడిచిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామని అమ్మాయి తల్లిదండ్రులు షమీర్ కుటుంబీకులకు తెలిపారు.
అమ్మాయి కుటుంబీకుల నిర్ణయం పట్ల సంతృప్తి చెందని షమీర్, అతని కుటుంబ సభ్యులు ఓ పథకం ప్రకారం ఆ అమ్మాయిని ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు కారులో తీసుకెళ్తుండగా..కారు రోడ్డు పక్క గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రేమజంటతో పాటు.. మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులు నలుగురూ తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
Also Read..
Monkey: కోతి చేసిన పనికి లబోదిబోమంటున్న బాధితుడు.. రూ.లక్ష ఎత్తుకెళ్లిన వానరం ఏం చేసిందో తెలుసా..?
Lakhimpur Kheri violence: అట్టుడుకుతున్న లఖింపూర్ ఖేరీ.. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిపై మర్డర్ కేసు..