Monkey: కోతి చేసిన పనికి లబోదిబోమంటున్న బాధితుడు.. రూ.లక్ష ఎత్తుకెళ్లిన వానరం ఏం చేసిందో తెలుసా..?
Monkey steals towel carrying rs 1 lakh cash: కోతి చేష్టల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.. వాటికి ఎలాంటి వస్తువులు దొరికినా.. చిందరవందర చేస్తుంటాయి.. తాజాగా ఓ కోతి
Monkey steals towel carrying rs 1 lakh cash: కోతి చేష్టల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.. వాటికి ఎలాంటి వస్తువులు దొరికినా.. చిందరవందర చేస్తుంటాయి.. తాజాగా ఓ కోతి చేసిన పనికి ఒక వ్యక్తి రూ.44వేలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నాడు. రూ.లక్ష రూపాయలను ఎత్తుకెళ్లిన కోతి చిందరవందర చేయడంతో.. లబోదిబోమంటున్నాడు. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌జిల్లాలోని కాటవ్ ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. అయితే.. దీనిపై ఇంకా ఫిర్యాదు నమోదు చేయలేదని.. ఆ ప్రాంతంలో సీసీ టీవీ పుటేజీ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. జబల్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటవ్ ఘాట్ రోడ్డులో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వెళ్తున్నారు. అయితే ఓ వ్యక్తి టవల్‌లో చుట్టుకోని లక్ష రూపాయలు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడతో ఆటో ఆగింది. కారణం ఏమిటో తెలుసుకొందామని ఆ ముగ్గురూ ఆటోనుంచి దిగారు. వారిలో ఒకడైన మహ్మద్ అలీ.. తన వద్ద టవల్‌లో చుట్టి ఉన్న లక్ష రూపాయలను కూడా ఆటో సీటులో ఉంచాడు.
అయితే.. టవల్‌లో ఏమైనా తినే పదార్థాలు ఉన్నాయనుకోని ఓ కోతి ఆటోలోకి ప్రవేశించి.. దానిని ఎత్తుకెళ్లింది. అనంతరం సమీపంలోని ఓ చెట్టుపైకి వెళ్లి టవల్‌ను విప్పతీయడంతో దానిలోని డబ్బులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన మహ్మద్ అలీ.. పరుగున అక్కడికి వెళ్లి కొన్ని డబ్బులను ఏరుకున్నాడు. చివరకు అవి లెక్కెట్టగా.. రూ.56 వేలు మాత్రమే దొరికినట్లు అలీ వాపోయాడు. మిగతా డబ్బులు దోరకలేదంటూ బాధితుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
అయితే.. ఈ ఘటనపై సింగ్రాంపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ఉపాధ్యాయ మాట్లాడుతూ.. కతంగి నివాసి అయిన మహ్మద్ అలీ ముందుగా ఈ స్టేషన్ కు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పాడని.. కానీ ఫిర్యాదు నమోదు చేయలేదని తెలిపారు. అయితే డబ్బు పోయిన ప్రాంతం మజోలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అతణ్ణి అక్కడికి పంపించినట్లు వెల్లడించారు. అటవీ ప్రాంతం కావడంవల్ల కోతుల సంచారం ఎక్కువగా ఉంటుందని, కొందరు వాటికి ఆహారం వేస్తూ ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: