Priyanka Gandhi Vadra: ‘ఈ దేశం రైతులది’.. పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ.. యూపీలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

UP Lakhimpur Kheri Violence Updates: ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఖీంపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని దాటుకోని వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక

Priyanka Gandhi Vadra: ‘ఈ దేశం రైతులది’.. పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ.. యూపీలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
Priyanka Gandhi Vadra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 04, 2021 | 9:01 AM

UP Lakhimpur Kheri Violence Updates: ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఖీంపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని దాటుకోని వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. హరగావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. లక్నోలోని తన ఇంటినుంచి ప్రియాంక లఖింపూర్ ఖేరీకి తెల్లవారుజామున బయలు దేరారు. ఈ క్రమంలో పోలీసులు ప్రియాంక గాంధీని అడుగడుగునా అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసుల వెల్లడించారు. దీంతో ప్రియాంక గాంధీ బాధితులను కలిసేందుకు కాలినడకన బయలుదేరగా.. లఖింపూర్ ఖేరికి వెళ్లే మార్గంలో హరగావ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

తాను ఇంటి నుంచి బయటకు రావడం నేరం కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులను కలిసి వారి బాధను పంచుకోవాలనుకుంటున్నానని ప్రియాంక వెల్లడించారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఆర్డర్ చూపించి కారు ఆపాలంటూ ప్రియాంక కోరారు. తాను బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తున్నానని, ఇదేమీ నేరం కాదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దేశం రైతులదని, బీజేపీది కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. ప్రియాంక గాంధీ లఖింపూర్ సందర్శించేందుకు ఆదివారం లక్నో విమానాశ్రయానికి చేరుకుని నేరుగా లక్నోలోని ఆమె నివాసమైన కౌల్ హౌస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచగా.. ఆమె అక్కడినుంచి తెల్లవారుజామున లఖింపూర్‌కు బయలు దేరారు.

కాగా.. లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం రాజీనామా చేయాలని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. దీంతోపాటు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల బృందం కూడా లఖీంపూర్ ఖేరీకి బయలు దేరింది. కాగా.. లఖింపూర్ ఖేరీకి భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్, ప్రజా సంఘాల నేతలు కూడా ఘాజీపూర్ బోర్డర్ నుంచి బయలు దేరి వెళ్లారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలోని టికునియాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్‌ దూసుకెళ్లడంతో.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ రోజు ప్రతిపక్షాలు సహా.. రైతు సంఘాల నేతలు ఈ ప్రాంతానికి వెళ్లనున్నట్లు వెల్లడించడంతో లఖీమ్‌పూర్ ఖేరీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు యూపీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Also Read:

Lakhimpur Kheri violence: యూపీలో హై అలర్ట్.. లఖీమ్‌పూర్‌ ఖేరీలో 144 సెక్షన్, రోడ్లు బ్లాక్.. ఇంటర్‌నెట్ బంద్..

Google Pay: ఆ సేవలపై వెనుకడుగు వేస్తున్న గూగుల్‌ పే.. ఇలా అయితే బ్యాంకులకు నష్టమే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!