Lakhimpur Kheri violence: యూపీలో హై అలర్ట్.. లఖీమ్‌పూర్ ఖేరీలో 144 సెక్షన్, రోడ్లు బ్లాక్.. ఇంటర్‌నెట్ బంద్..
UP Lakhimpur Kheri Violence Updates: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న
UP Lakhimpur Kheri Violence Updates: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లడంతో.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది వరకు మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పేర్కొంటున్నారు. దీంతో లఖీమ్‌పూర్ ఖేరీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ప్రతిపక్షాలు సహా.. రైతు సంఘాల నేతలు ఆ ప్రాంతానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. లఖీమ్‌పూర్‌ఖేరి ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజకీయ నాయకులకు ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించారు. లఖీమ్‌పూర్‌లో ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్, టీఎంసీ నేతలు, ఆర్‌ఎల్‌డీ, బీఎస్పీ, రైతు రాకేష్ టికాయట్ ఈ ప్రాంతానికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నేతలు ఎవరూ ఈ ప్రాంతానికి రాకుండా వాహనాలు, బారీకేడ్లు అడ్డుపెట్టి భారీ బందోబస్తుతో పలు రోడ్డు మార్గాలను బ్లాక్ చేశారు. దీంతోపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారం చేరుకున్నారు. అయితే.. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలతో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చేలరేగినట్లు పేర్కొంటున్నారు. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లడంతో నలుగురు రైతులు, వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు వినిపిస్తుండటంతో.. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. తన కుమారుడు లేడని.. రైతులే దాడి చేశారని పేర్కొన్నారు.
Also Read: