Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ ఘటన దురదృష్టకరం.. బాధ్యులపై కఠిన చర్యలు : సీఎం యోగి ఆదిత్యానాధ్
Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ కారు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని,
Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ కారు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. రైతుల చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, ఎవరూ ఆందోళనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని ప్రజలను కోరారు. దర్యాప్తు పూర్తి కాకుండా ప్రజలు ఎలాంటి నిర్ధారణకు రావద్దని సూచించారు.
8 మంది మరణించారు లఖింపూర్ ఘటనలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఇందులో నలుగురు రైతులు ఉన్నట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ తన కార్యకర్తలలో నలుగురు మరణించారని ప్రకటించింది. పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ADG లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ కూడా లఖింపూర్ చేరుకున్నారు.
మరోవైపు లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించడం దారుణమంటున్నారు. కాంగ్రెస్, బిఎస్‌పి, ఎస్‌పి సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రేపు లఖింపూర్ ఖేరిని సందర్శిస్తానని ప్రకటించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. రైతులు చనిపోయినా స్పందించని సీఎం యోగి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
UP CM Yogi Adityananth says that Lakhimpur incident is unfortunate. The state government will go into depth and expose elements involved in the incident and will take strict action against them: UP Govt pic.twitter.com/bGgNldG2Te
— ANI UP (@ANINewsUP) October 3, 2021