లఖింపూర్ ఖేరీ ఘటనపై స్పందించిన ప్రతి పక్షాలు.. రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న పలువురు నేతలు..
Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు దారుణంగా కారెక్కించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించారు. ఈ ఘటనపై విపక్షాలన్నీ తమ గొంతును వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బిఎస్‌పి, ఎస్‌పి సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రేపు లఖింపూర్ ఖేరిని సందర్శిస్తానని ప్రకటించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు కారెక్కియడం అమానుషమని అన్నారు. రైతులు చనిపోయినా స్పందించని సీఎం యోగి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు రేపు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు.
మరోవైపు BSP చీఫ్ మాయావతి కూడా ఈ విషయంపై మండిపడుతున్నారు. కావాలనే ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ సంఘటన బీజేపీ క్రూరమైన, అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. రేపు బాధిత కుటుంబాలను కలుసుకొని అండగా ఉంటామన్నారు. రాష్ట్రీయ లోక్‌దల్ చీఫ్ జయంత్ చౌదరి కూడా లఖింపూర్ ఖేరీ ఘటనను అణచివేసే చర్యగా పరిగణించారు. ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కావాలని కాన్వాయ్ అమర్చారని ఆరోపించారు. ఈ విషయంలో రాజకీయాలు చాలా వేడిగా మారాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచాయి.
1. यूपी के जिला लखीमपुर खीरी में 3 कृषि कानूनों की वापसी की माँग को लेकर आन्दोलन कर रहे किसानों पर केन्द्रीय मंत्री के पुत्र द्वारा कथित तौर पर कई किसानों की गाड़ी से रौंद कर की गई हत्या अति-दुःखद। यह भाजपा सरकार की तानाशाही व क्रूरता को दर्शाता है जो कि इनका असली चेहरा भी है।
— Mayawati (@Mayawati) October 3, 2021