Viral Video: నాగుపాముకు చుక్కలు చూపించిన ఉడుత.. పోరు మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు!

Viral Video: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిపై జనాలు కూడా ఆసక్తి కనబరుస్తారు. అందుకే క్షణాల్లో నెట్టింట..

Viral Video: నాగుపాముకు చుక్కలు చూపించిన ఉడుత.. పోరు మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు!
Snake And Squirrel
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2021 | 9:59 PM

సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిపై జనాలు కూడా ఆసక్తి కనబరుస్తారు. అందుకే క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి.. ఇలా కొన్ని జంతువులు పోట్లాడుకోవడం మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ఆయా పోరాటాలకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి. అయితే మీరెప్పుడైనా ఉడుత-నాగుపాము మధ్య పోరాటాన్ని చూశారా.? ఒకవేళ చూడకపోతే ఈ వీడియోను చూడండి మీకే అర్ధమవుతుంది.

మనుషుల్లోనైనా, జంతువులలో అయినా తల్లిప్రేమ ఒకేలా ఉంటుంది. ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీ తల్లి తన బిడ్డను సంరక్షిస్తుంది. ఇదే కోవకు చెందిన ఈ వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. తమ పిల్లలకు నాగుపాము హాని తలపెడుతుందని ఓ ఉడుత దానితో పోరాటానికి దిగుతుంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఉడుత నాగుపాముతో యుద్దానికి దిగుతుంది. తమ పిల్లలకు ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో పాముతో పోరుకు సిద్దమవుతుంది. నాగుపాముకు చుక్కలు చూపిస్తూ దాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ఉడుతను కాటు వేసేందుకు నాగుపాము ప్రయత్నించినా.. క్షణాల్లో దాని నుంచి తప్పించుకునేందుకు గాల్లో ఎగురుతుంది. కాగా, ఈ వీడియోను ‘Latest Kruger Sightings’ అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయగా.. ణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్స్, రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Read Also: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో చాలా మంది గుర్తించలేకపోయారు.!

పిల్లల ముందు ఈ 5 పనులు తల్లిదండ్రులు చేయకూడదు.. ఖచ్చితంగా గుర్తించుకోండి!