Mobile Game: హైదరాబాద్‌లో విషాదం.. ఫోన్‌లో గేమ్ ఆడొద్దన్నందుకు బాలిక బలవన్మరణం.. రాత్రి వేళ ఇంట్లో..
Student Suicide: క్షణికావేశంలో పిల్లలు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్య చేసుకుని
Student Suicide: క్షణికావేశంలో పిల్లలు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్య చేసుకుని తల్లీదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఓ చిన్నారి ఫోన్‌లో గేమ్స్ ఆడోద్దన్నందుకు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మీర్‌పేట్ పీఎస్ పరిధిలోని సర్వోదయ నగర్లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాలిక మొబైల్ ఫోన్‌తో గేమ్స్ ఆడుతుండగా రాత్రి అయింది పడుకో అంటూ తండ్రి మందలించాడు. దీంతో మనోవేదనకు గురైన చిన్నారి బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. బాలిక పదో తరగతి చదువుతున్నట్లు బంధువులు పేర్కొన్నారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read :