Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ రాబడిని పొందే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉంది.. ఎలానో తెలుసుకోండి!

సమ్మేళనం (కాంపౌండ్) అంటే తెలుసుకదా? ఒక పదార్ధాన్ని(మూలకాన్ని).. ఇంకో పదార్ధంతో కలిపి మరో అద్భుతమైన పదార్ధాన్ని తయారు చేయడం. మ్యూచువల్ ఫండ్స్ సమ్మేళన శక్తి పెట్టుబడి పరంగా సంపద సృష్టి కోసం అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి.

Mutual Funds: తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ రాబడిని పొందే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉంది.. ఎలానో తెలుసుకోండి!
Compounding
Follow us
KVD Varma

|

Updated on: Oct 04, 2021 | 11:02 AM

Mutual Funds: సమ్మేళనం (కాంపౌండ్) అంటే తెలుసుకదా? ఒక పదార్ధాన్ని(మూలకాన్ని).. ఇంకో పదార్ధంతో కలిపి మరో అద్భుతమైన పదార్ధాన్ని తయారు చేయడం. ఇలా పదార్ధాలను సమ్మేళనం చేయడాన్ని శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ దీనిని ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతం అని పేర్కొన్నారు. ఇప్పడు ఆయన అద్భుతం అని చెప్పిన అదే సమ్మేళనాన్ని ఆర్ధిక వ్యవస్థలో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. మన డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకున్నపుడు దానిని సమ్మేళన విధానంలో చేస్తే ఆదాయం వేగంగా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సమ్మేళన శక్తి పెట్టుబడి పరంగా సంపద సృష్టి కోసం అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి.

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుంటే కనుక..  మీరు ఒక పథకంలో రూ .100 పెట్టుబడి పెట్టారని అనుకోండి . మీకు రూ .5    కాంపౌండ్ ఇంట్రస్ట్ వస్తుంది. ఇప్పుడు తదుపరి సమ్మేళన చక్రంలో, రిటర్న్ రూ .100 కి బదులుగా దీనిని  రూ. 105 గా లెక్కించవచ్చు.  అంటే మీరు రూ. 105 మొత్తానికి వడ్డీ పొందుతారు. మీ సంపద కాంపౌండ్ విధానం ద్వారా  గుణాత్మకంగా పెరుగుతుంది. అయితే, సమ్మేళనం చేయడానికి సమయం అలాగే సహనం అవసరం.

ఇద్దరు వ్యక్తుల సమానమైన పెట్టుబడి, కానీ విభిన్న రాబడి

రిటైర్మెంట్ ప్రణాళిక కోసం A అనే ​​వ్యక్తి 30 సంవత్సరాల వయస్సు నుండి నెలకు 2000 రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తాడు. మరోవైపు, B అనే వ్యక్తి 45 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 4000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తాడు. ఇద్దరు వ్యక్తులు 60 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టారు. ఇద్దరికీ 10%రాబడి వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు అతను ఎంత కార్పస్ సేకరించాడో చూద్దాం.

పెట్టుబడిదారుడు ఎ పెట్టుబడిదారు బి
30 సంవత్సరాల వయస్సు నుండి నెలకు 2000 రూపాయల SIP ని ప్రారంభించారు. 45 సంవత్సరాల వయస్సు నుండి నెలకు 4000 రూపాయల SIP ప్రారంభించారు.
60 సంవత్సరాల వయస్సు వరకు SIP ని కొనసాగించిన తర్వాత, డిపాజిట్ చేసిన మొత్తం 7.20 లక్షలు 60 సంవత్సరాల వయస్సు వరకు SIP ని కొనసాగించిన తర్వాత, డిపాజిట్ చేసిన మొత్తం 7.20 లక్షలు
10% వార్షిక రాబడి కారణంగా, A  కార్పస్ రూ. 45.58 లక్షలు అవుతుంది. 10% వార్షిక రాబడి కారణంగా, B యొక్క కార్పస్ రూ .16.71 లక్షలు అవుతుంది.

పై ఉదాహరణలో ఇద్దరూ కలిసి ఒక్కొక్కరికి రూ .720,000 డిపాజిట్ చేసారు. కానీ A యొక్క కార్పస్ B కంటే 2.7 రెట్లు ఎక్కువ. ప్రారంభ పెట్టుబడిని ప్రారంభించే ప్రయోజనం A కి లభించింది. అతని నెలవారీ పెట్టుబడి మొత్తం B కంటే సగం అయినప్పటికీ, పెట్టుబడి వ్యవధి రెట్టింపు.

గమనిక: ద్రవ్యోల్బణం గణన కోసం పరిగణనలోకి తీసుకోబడదు. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని భావించి, A అలాగే, B పెట్టుబడి వ్యవధిలో ఒకే పథకంలో పెట్టుబడి పెడుతున్నారు.

మీ ఆదాయం పెరిగే కొద్దీ  తదనుగుణంగా SIP మొత్తాన్ని పెంచండి. ఇలా చేయడం ద్వారా కాంపౌండింగ్ రిటర్న్ కూడా పెరుగుతుంది మీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే SIP ద్వారా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం. లక్ష్యం సాధించే వరకు SIP ని ఆపవద్దు. ఇది రెండు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సంవత్సరానికి పెట్టుబడి మొత్తం పెరుగుతుంది. సమ్మేళనం రాబడి కూడా పెరుగుతుంది.

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకుని ఉంటుంది. ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచింది.

ఇవి కూడా చదవండి..

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!

Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!